గ్యాంగ్స్ ఆఫ్-18 ట్రైలర్ విడుదల

గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు, కార్పోరేట్ స్కూల్ విద్యార్థులకు మధ్య జరిగిన గ్యాంగ్స్ గొడవల్లో విద్యార్థుల జీవితాల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.. అనే వినూత్నమైన కథాశంతో శంకర్ రామకృష్ణన్ దర్శకత్వంలో మలయాళంలో రూపొందిన చిత్రం “18ఏయమ్ పడి”. ఈ చిత్రాన్ని తెలుగులో యస్ వి వి ఆర్ట్స్ పతాకంపై జివి సాంబిరెడ్డి “గ్యాంగ్స్ ఆఫ్ 18” పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, పృద్విరాజ్ సుకుమార్, ఆర్య ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం తెలుగు ట్రైలర్ ఫిబ్రవరి 9న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు సంతోష్ జాగర్లపూడి, నటులు చందునాథ్, అక్షయ్ రాధాకృష్ణన్, అశ్విన్ గోపీనాథ్, అర్ష బాయిజు, హీరోయిన్స్ వాప ఖదీజ రెహమాన్, ఆహాన కృష్ణ, నిర్మాత జివి సాంబిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గోపినందన్ రెడ్డి, కొరియోగ్రాఫర్ సజాన తదితరులు పాల్గొన్నారు…

GANGS OF 18 TRAILER

ముఖ్యఅతిధిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు సంతోష్ జాగర్లపూడి మాట్లాడుతూ… ఇరవైయేళ్లుగా సాంబిరెడ్డి గారు మా ఫ్యామిలీకి చాలా ముఖ్య సన్నిహితుడు.. త్వరలో నాతో కూడా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు.. “గ్యాంగ్స్ ఆఫ్ 18” ట్రైలర్ చాలా బాగుంది. లిప్ సింక్ కరెక్ట్ గా కుదిరింది. డైరెక్ట్ తెలుగు సినిమాలా అనిపించింది. డైలాగ్స్ అన్నీ బ్యూటిఫుల్ గా ఉన్నాయి. సాంబిరెడ్డి గారు చాలా కేర్ తీసుకొని ఈ సినిమాని చేస్తున్నారు. సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. యూనిట్ అందరికీ కంగ్రాట్స్.. అన్నారు.

నటుడు చందునాథ్ మాట్లాడుతూ.. ‘ ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాను.. కొన్నిరోజుల తర్వాత ఒక ముఖ్యమైన క్యారెక్టర్ లో నన్ను చేయమన్నారు డైరెక్టర్ శంకర్ రామకృష్ణన్. బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇచ్చారు. మమ్ముట్టి గారి తమ్ముడిగా ఈ చిత్రంలో జొయ్స్ పాత్రలో నటించాను. సినిమా చాలా బాగా వచ్చింది. తెలుగు పరిశ్రమ చాలా పెద్ద ఇండస్ట్రీ. నాకు చాలా ఇష్టం. మా సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్న సాంబిరెడ్డి గారికి చాలా థాంక్స్.. అందరూ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు.. అన్నారు.

మరోనటుడు అశ్విన్ మాట్లాడుతూ… ” 17, 18 సంవత్సరాల యువకుల మధ్య జరిగిన స్టోరీ.. రెండువర్గాల మధ్య జరిగిన వార్ లో వారి జీవితాలు ఎలా నాశనం అయ్యాయి అనేది మెయిన్ కథాంశం. వెరీ గ్రేట్ ఫిల్మ్. ఈ సినిమాలో నటీచడం చాలా హ్యాపీగా ఉంది. ప్రతీ ఒక్కరికీ ఈ చిత్రం నచ్చుతుంది.. అన్నారు.

హీరోయిన్ అహాన కృష్ణ మాట్లాడుతూ.. ” సినిమాలో నటించడం చాలా ఎగ్జైట్ గా ఉంది.ట్రైలర్ కి హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. అందరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.. అన్నారు.

నటుడు అంబి మాట్లాడుతూ… నాకు ఇష్టమైన తెలుగు ఇండస్ట్రీలో మా సినిమా రిలీజ్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి సినిమాలో నేను ఒక పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది.. అన్నారు. కోరియోగ్రాఫర్ సజాన మాట్లాడుతూ.. ‘ ఇది ఒక యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్రతీ ఒక్కరూ అద్భుతంగా నటించారు.. డైరెక్టర్ శంకర్ రామకృష్ణన్ గారు వండర్ ఫుల్ గా తెరకెక్కించారు. హోల్ టీమ్ అందరికీ చాలా థాంక్స్. తప్పకుండా ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.. అన్నారు.

మరొక హీరోయిన్ వఫా మాట్లాడుతూ.. ‘ ఆడియన్స్ అందరికీ నచ్చేలా.. ప్రతీ క్యారెక్టర్ రిలేటెడ్ గా ఉంటుంది. డైరెక్టర్ శంకర్ గారు సూపర్బ్ క్యారెక్టర్ ఇచ్చారు. సాంబిరెడ్డి గారు తెలుగులో ఈ సినిమా చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.. ఆయనకి మా అందరి తరుపున కృతజ్ఞతలు.. అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గోపినందన్ రెడ్డి మాట్లాడుతూ.. మావయ్య సాంబిరెడ్డి గారి సహకారంతో ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాను. అవకాశం ఇచ్చిన మవయ్యకు కృతజ్ఞతలు. ప్రతీ గ్యాంగ్ కి ఈ చిత్రం రిలేటెడ్ గా ఉంటుంది. ఇదీ ప్రతీ ఒక్కరి కథ. భరణి గారు, సంతోష్ జాగర్లపూడి గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అందరూ ఎంజాయ్ చేసేలా ఈ మూవీ ఉంటుంది.. అన్నారు. నిర్మాత జివి సాంబిరెడ్డి మాట్లాడుతూ.. ‘ మా శ్రీ వెంకటేశ్వరా విద్యాలయమ్స్ ఆర్ట్స్ బ్యానర్లో ఇది రెండవ సినిమా. సినిమా చూసి ఎంతో ఇష్టంతో తెలుగులో రిలీజ్ చేయాలని రైట్స్ తీసుకున్నాను.. అయ్యప్పన్, అశ్విన్ రెండు గ్యాంగ్స్ కి సంబంధించిన ఇన్సిడెంట్స్ వారి జీవితాలను ఏవిధంగా మార్చింది అనేది కథ. ఫ్యామిలీ ఆడియెన్స్ తో పాటు అన్నివర్గాల వారికి ఈ చిత్రం బాగా నచ్చుతుంది. యాక్షన్ సన్నివేశాలు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. దర్శకుడు శంకర్ రామకృష్ణన్ అత్యద్భుతంగా “గ్యాంగ్స్ ఆఫ్ 18” రూపొందించారు. మా బ్యానర్లో నెక్స్ట్ మూడవ సినిమాని సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో చేయబోతున్నాం.. మార్చ్ నుండి సినిమా స్టార్ట్ అవుతుంది. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాం.. అన్నారు.

మమ్ముట్టి, పృద్విరాజ్ సుకుమారన్, ఆర్య, ప్రియమణి, చందునాథ్, అహాన కృష్ణ, అక్షయ్ రాధాకృష్ణన్, అశ్విన్ గోపినాధ్, ఆర్షబాయిజు, వాప ఖాదీజరహమాన్, ప్రదీప్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం; ఎ హెచ్ ఖాషిప్, సినిమాటోగ్రఫీ; సుదీప్ ఎలమోన్, ఎడిటర్; భువన్ శ్రీనివాసన్, దర్శకత్వం; శంకర్ రామకృష్ణన్, నిర్మాత; జివి సాంబిరెడ్డి.