సీన్ సిరిగే, సీటీ కొట్టే… స్టెప్పులేశారు

ఇప్పటి వరకూ 24 సినిమాలతో ప్రేక్షకులని అలరించిన నాని నటిస్తున్న 25వ చిత్రం గ్యాంగ్ లీడర్. విక్రమ్ కే కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఇప్పటి వరకూ బయటకి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినీ అభిమానులని ఆకట్టుకుంది. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్, గ్యాంగ్ లీడర్ ప్రొమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగానే సినిమాలోని పాత్రలని పరిచయం చేస్తూ ఒక ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ చేశారు. సీన్ సిరిగి, సీటి కొట్టి అంటూ సాగిన వీడియో సాంగ్ లో నానితో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా కనిపించడం విశేషం. పార్టీ మూడ్ లో సాగిన ఈ సాంగ్ కి నాని అండ్ అనిరుధ్ సూపర్ డాన్స్ చేసి గ్యాంగ్ లీడర్ సినిమాకి కొత్త కళ తెచ్చారు. సినిమాలో నటించిన సీనియర్ ఆర్టిస్ట్ లక్ష్మీ అండ్ గ్యాంగ్ గురించి ఆడియన్స్ కి పరిచయం చేస్తూ కంపోజ్ చేసిన ఈ సాంగ్ లో మంచి జోష్ ఉంది. ఇదే జోష్ మరో వారం పాటు మైంటైన్ చేస్తే గ్యాంగ్ లీడర్ సినిమా భారీ ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉంది.