

5వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో భారతదేశంలో జరిగిన కొన్ని చరిత్ర లో రాని నిజజీవితాల కథనాలతో ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో వస్తున్న చిత్రం ‘గేమ్ అఫ్ చేంజ్’. జాతీయ, అంతర్జాతీయ నటి నటులతో సిద్ధార్థ్ రాజశేఖర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో మలయాళ దర్శకుడు సిధిన్ దర్శకత్వంలో సిద్ధార్థ్ రాజశేఖర్, మీనా చాబ్రియా నిర్మించిన అంతర్జాతీయ చిత్రం ‘గేమ్ అఫ్ చేంజ్’. ఈ చిత్రం ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇక సినిమా మే 14న అన్ని భాషల్లో చాలా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.
ఈ సందర్భంగా దర్శకుడు సిధిన్ మాట్లాడుతూ ‘‘ఇక్కడ సాధారణ క్షణాలు అసాధారణమైన జీవన మలుపులుగా మారతాయి. ‘గేమ్ ఆఫ్ చేంజ్’ అనే సినిమా ఒక శక్తివంతమైన జీవన విధానాన్ని తీర్చిదిద్దే అస్త్రం వంటిది. సాధారణమైన క్షణాలు అసాధారణమైన మార్పులను రేకెత్తించిన పలు వ్యక్తుల ఆకర్షణీయమైన వ్యక్తిగత నిజ జీవిత కథనాలను మిళితం చేసి రూపొందించిన చిత్రమిది. భారతదేశ చరిత్రలో కుమార గుప్తుడు శా.శ 427లో నిర్మించిన నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగిన కొన్ని నిజ జీవితాల కథనాలతో ఈ చిత్రం వుంటుంది’ అన్నారు.
నిర్మాత సిద్ధార్థ్ రాజశేఖర్ మాట్లాడుతూ ‘‘2018లో ‘ఇంటర్నెట్ లైఫ్ స్టైల్‌హబ్’ ప్రారంభించి, ఇప్పటివరకు 30 వేల మందికి డిజిటల్ కోచింగ్ ఇచ్చాను. నేను ఇంగ్లీష్‌లో రాసిన ‘యు కెన్ కోచ్’ అనే పుస్తకం ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు జరిగాయి. ప్రస్తుతం సినిమా రంగంపై వున్న మక్కువతో ఈరోజు నిర్మాతగా, నటుడిగా ‘గేమ్ అఫ్ చేంజ్’ చిత్రం తో మీ ముందుకు వచ్చాను’ అన్నారు.
మరో నిర్మాత మీనా చాబ్రియా మాట్లాడుతూ ‘‘ఇండియాలో ఇప్పటివరకు ఎవరూ చేయని సాహసం చేసాం. ఇటీవల సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘చావా’ సినిమా కథ గురించి మన భారతీయులకు, పైగా శంభాజీ మహారాజ్ గురించి మరాటి వారికీ కూడా తెలియని కథ అది. అలాంటి కథను ప్రజల ముందుకు తీసుకువచ్చారు. సినిమా చూసిన ప్రతీ భారతీయుడికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. వయో బేధం లేకుండా చిన్నారుల నుండి వృద్ధుల వరకు దేశభక్తి ఉప్పొంగింది. అదే విధంగా మా ‘గేమ్ అఫ్ చేంజ్’ చిత్ర కథ కూడా ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌పై రాలేదు. మే 14న ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నాం’’ అన్నారు.
నటినటులు : బ్లెర్ సింగర్, సిద్ధార్థ్ రాజశేఖర్, సురేంద్రన్ జయ శేఖర్, దినాజ్ వేర్వాట్వాల, ఆదిత్య, సోనియా శర్మ, గీతా మిక్కిలినేని,హరీష్, ప్రియాదావే, కుషాల్ కులకర్ణి, దేవినా రావు, విశాల్ సైని, డాక్టర్ ప్రభాకర్ రాజు, వినీత సిద్ధార్థ్ తదితరులు
సాంకేతికవర్గం :
దర్శకత్వం : సిధిన్
నిర్మాతలు : సిద్ధార్థ్ రాజశేఖర్, మీనా చాబ్రియా,
క్రియేటివ్ ప్రొడ్యూసర్ : శివ రాజ్,
సంగీతం : శ్రీరాజ్ సాజి,
సినిమాటోగ్రాఫర్ : ఆకాష్ సేథి,
ఎడిటర్: అభిలాష్ .బి,
స్క్రిప్ట్ రైటర్స్ : సిధిన్ – సోయం,
పి ఆర్ ఓ : రాంబాబు వర్మ