Gaali Sampath: గాలి సంప‌త్ ప్రీరిలీజ్ ఈవెంట్ టైం ఫిక్స్‌..

Gaali Sampath: శ్రీ‌విష్ణు, న‌ట‌కీరికీ రాజేంద్ర‌ప్ర‌సాద్ ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో తెర‌కెక్కుతున్న చిత్రం గాలి సంప‌త్. ఈ చిత్రానికి స్టార్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణతో పాటు డైలాగ్స్ అందిస్తున్నారు. అలాగే అనీష్ కృష్ణ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించి పోస్ట‌ర్ల్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్, సాంగ్స్ ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఫిదా చేశాయి. దీంతో ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ Gaali Sampath చిత్రం మ‌హా శివ‌రాత్రి కానుక‌గా మార్చి 11న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంద‌ర్భంగా.. రేపు సాయంత్రం 6గంట‌ల‌కు ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక‌లు హైద‌రాబాద్ ఫిలింన‌గ‌ర్ జేఆర్‌సీ క‌న్వెన్ష‌న్‌లో నిర్వ‌హించ‌నున్నారు చిత్ర‌బృందం. ఈ మేర‌కు పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. ఇక ఈ చిత్రాన్ని స‌న్‌షైన్ స్ర్ర్కీన్స్‌, ఇమేజ్ స్పార్క్ సంస్థ‌లు నిర్మిస్తుండ‌గా.. ఈGaali Sampath చిత్రంలో శ్రీ‌విష్ణుకు జోడీగా ల‌వ్‌లీ సింగ్ హీరోయిన్‌గా చేస్తోంది.