Tollywood: గాలిసంప‌త్ నుంచి తొలి పాట రిలీజ్‌..

Tollywood: టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ‌విష్ణు, న‌ట‌కీరిటీ రాజేంద్ర‌ప్రసాద్ ప్ర‌ధాన పాత్ర‌లుగా పోషిస్తున్న చిత్రం గాలిసంప‌త్. ఈ సినిమాకు డైరెక్ట‌ర్‌గా అనిష్ కాగా.. స్టార్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తూనే స్ర్కీన్‌ప్లే డైలాగ్స్ ఈ చిత్రానికి అందిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి మొద‌టి సాంగ్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. ఫిఫిఫీ అంటూ సాగే పాట‌ను ప్ర‌ముఖ పాట‌ల ర‌చ‌యిత రామ‌జోగ‌య్య‌శాస్త్రి అందించ‌గా.. సింగ‌ర్స్ రాహుల్ నంబియ‌ర్‌, కృష్ణ ఈ పాట‌ను ఆల‌పించారు.

Gaalisampath first song

ప్ర‌స్తుతం Tollywoodఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతుంది. ఇక ఈ సినిమాకు సంగీతం అందించిన అచ్చు రాజ‌మ‌ణి.. Tollywoodఈ సినిమాలోని మొద‌టి సాంగ్‌తోనే సంగీత ప్రియుల‌ను ఆక‌ట్టుకుంటున్నాడు. ఇక ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకోగా.. షైన్ స్ర్కీన్స్‌, ఇమేజ్ స్పార్క్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇకTollywood ఈ సినిమాలో రాజేంద్ర‌ప్ర‌సాద్‌, శ్రీ‌విష్ణు తండ్రీ కొడుకులుగా న‌టిస్తుండ‌గా.. మార్చి 11న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుందని చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించారు.‌