ఈ నెల 16 నుంచి ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. విడతల వారీగా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా వైద్య సిబ్బందికి, 50ఏళ్లు పైబడిన వారికి అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు స్పష్టం చేసింది.
దీని కోసం ప్రభుత్వం కోవిన్ అనే ప్లాట్‌ఫామ్ రూపొందించగా.. ఈ యాప్‌లో కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి. అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలంటే ఆధార్ నెంబర్‌కు మొబైల్ లింక్ తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. ఇలా లింక్ చేసుకున్నవారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తామంది. లింక్ చేసుకోనివారు ఇప్పటికైనా చేసుకోవాలని కేంద్రం సూచించింది.