‘థగ్ లైఫ్’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్

పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘థగ్ లైఫ్’ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇండియన్ సినిమాలో రెండు పవర్ హౌసెస్ ఉలగనాయగన్ కమల్ హాసన్, విజనరీ డైరెక్టర్ మణిరత్నం మూడున్నర దశాబ్దాల తరువాత ఈ సినిమాతో మళ్లీ కలసి రావడం విశేషం. వీరి కాంబినేషన్ లో వచ్చిన లెజెండరీ మూవీ నాయకుడు భారత చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. అందుకే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. మాఫియా గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సాగే ఈ కథలో ఇంటెన్స్  డ్రామా, ఎమోషన్స్ తో నిండిన కథనాన్ని ‘థగ్ లైఫ్’ అందించబోతోంది.

ఈ ఉత్సాహానికి మరింత ఊపునిచ్చే అంశం హీరో సింబు కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ పాత్ర కథకు బలాన్ని, డైనమిజాన్ని అందించనుంది.
ఈ చిత్రంలో త్రిషా కృష్ణన్, సాన్యా మల్హోత్రా, అశోక్ సెల్వన్, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రంలోని ఫస్ట్ సాంగ్ ‘జింగుచా’  వెడ్డింగ్ యాంథమ్ గా అదరగొట్టింది. రెహమాన్ తన ప్రత్యేక శైలిలో ఆధునిక బాణీలతో ఈ పాటను అద్భుతంగా మలిచారు. మంగ్లీ, శ్రీకృష్ణ, ఆశిమా మహాజన్, వైశాలి సామంత్ ప్లజెంట్ వోకల్స్ తో పాటకు ప్రాణం పోశారు. అనంత శ్రీరామ్ రాసిన లిరిక్స్ పాటకి పండుగ వాతావరణాన్ని ఇచ్చాయి. ఇది శబ్దాల, నృత్యాల, సాంస్కృతిక ఉత్సవంగా నిలుస్తోంది.

సాంగ్ విజువల్ గా ఐఫీస్ట్ లా వుంది. కమల్ హాసన్ తన ప్రజెన్స్ తో కట్టిపడేశారు, సాన్యా మల్హోత్రా ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో అద్భుతంగా మెప్పించింది. సింబు, త్రిష,  ఇతర నటులు కూడా తమ ప్రజెన్స్ పాటను మరో స్థాయికి తీసుకెళ్ళారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రవి కె చంద్రన్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైన్: శర్మిష్ట రాయ్, స్టంట్స్: అన్బరివ్

ఈ సినిమాను కమల్ హాసన్, మణిరత్నం, ఆర్ మహేంద్రన్, శివ ఆనంద్ కలిసి రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.   ఉదయనిధి స్టాలిన్ రెడ్ జైయింట్ మూవీస్ ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేస్తోంది. శ్రేష్ఠ్ మూవీస్ (ఎన్ సుధాకర్ రెడ్డి) ద్వారా ఈ సినిమా తెలుగులో గ్రాండ్ గా విడుదలవుతుంది. గతంలో విక్రమ్, అమరన్ లాంటి బ్లాక్‌బస్టర్లు అందించిన ఈ సంస్థ ఇప్పుడు ‘థగ్ లైఫ్’ను తీసుకొస్తోంది. సినిమా జూన్ 5న విడుదల కానుంది.

తారాగణం:
కమల్ హాసన్, సింబు, త్రిషా కృష్ణన్, అలీ ఫజల్, అశోక్ సెల్వన్, పంకజ్ త్రిపాఠి, జోజు జార్జ్, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, సాన్యా మల్హోత్రా

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: మణిరత్నం
నిర్మాతలు: కమల్ హాసన్, మణిరత్నం, ఆర్ మహేంద్రన్, శివ ఆనంద్
బ్యానర్లు: రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్
ప్రెజెంటర్: ఉదయనిధి స్టాలిన్ (రెడ్ జైయింట్ మూవీస్)
తెలుగు రిలీజ్: శ్రేష్ఠ్ మూవీస్ (ఎన్ సుధాకర్ రెడ్డి)
సంగీతం: ఏఆర్ రెహమాన్
సినిమాటోగ్రాఫర్: రవి కె చంద్రన్
యాక్షన్: అన్బరివ్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: శర్మిష్ట రాయ్
పీఆర్వో: వంశీ-శేఖర్