`ఫ‌స్ట్ ర్యాంక్ రాజు`కి యు/ఎ ఇచ్చిన సెన్సార్ బోర్డు!

First Rank Raju Completes Censor

నీకు ఈక్వేష‌న్స్ ఫార్ములాస్ త‌ప్ప ఫీలింగ్స్ తెలియ‌వు. ఐ హేట్ యు అని హీరోయిన్ ఫ‌స్ట్ ర్యాంక్ రాజుతో అంటుంది.

అందుకు అత‌ను శ్రుతీ... ఐ హేట్ యు కాదు.. ఐ యామ్ హేటింగ్ యు.. ప్రెజెంట్ టెన్స్ అని చెబుతాడు.

పుస్త‌కాల జ్ఞానం త‌ప్ప లోక‌జ్ఞానం బొత్తిగా లేని వ్య‌క్తి ఫ‌స్ట్ ర్యాంక్ రాజు. వాళ్లూ వీళ్లూ చెప్పింది విని మ‌ధ్య‌లో క‌ల‌ర్ క‌ల‌ర్ దుస్తుల్లోకి మారిన అత‌ని జీవితం ఏమైంది? ఫ‌స్ట్ ర్యాంక్ రాజు లైఫ్ లో జ‌రిగిన స‌న్నివేశాల స‌మాహారం ఏంటో తెలుసుకోవాలంటే మాత్రం ఈ నెల 21న వ‌ర‌కు ఆగాల్సిందే. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ నెల 21న విడుద‌ల కానుంది. ఫ‌స్ట్ ర్యాంక్ రాజు. ఈ చిత్రంలో చేత‌న్ మ‌ద్దినేని హీరో. కాషిష్ ఓరా, ప్ర‌కాష్‌రాజ్‌, ప్రియ‌ద‌ర్శి, బ్ర‌హ్మానందం, వెన్నెల కిశోర్‌, రావు ర‌మేష్‌, న‌రేష్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. `విద్య 100% బుద్ధి 100% అనేది ట్యాగ్‌లైన్‌. ఈ చిత్రం సెన్సార్ పూర్త‌యింది. సెన్సార్ స‌భ్యులు యు/ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చారు. న‌రేష్ కెమార్ హెచ్‌.ఎన్‌. ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. కిర‌ణ్ ర‌వీంద్ర‌నాథ్ సంగీతాన్ని స‌మ‌కూర్చారు. మంజునాథ్ వి కందుకూరు నిర్మాత‌. డాల్ఫిన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకంపై రూపొందించారు. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూష‌న్ విడుద‌ల చేస్తోంది. ర్యాంకులు వ‌చ్చిన‌వారే తెలివైన వార‌నీ, రాని వారు దేనికీ ప‌నికి రార‌ని సొసైటీలో ఓ భ్ర‌మ ఉంది. దీని గురించి నిత్యం చ‌ర్చ‌లు జ‌రుగుతూనే ఉంటాయి. ఈ సినిమా టైటిల్‌, ట్రైల‌ర్‌లోని డైలాగులు కూడా ట్రెండ్‌కు త‌గ్గ‌ట్టే ఉండ‌టంతో మంచి స్పంద‌న ల‌భిస్తోంది.