‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ నుండి మొదటి లిరికల్ పాట “మా ఊరు శ్రీకాకుళం” విడుదల

వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ళ ముఖ్య పాత్రలలో నటిస్తూ రాబోతున్న చిత్రం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. మోహన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను వెన్నపూస రమణ రెడ్డి నిర్మిస్తుండగా రాజేష్ రాంబాల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తుండగా మల్లికార్జున్ నారగాని సినిమాటోగ్రఫీ చేసారు. మురళీధర్ గౌడ్, సియా గౌతమ్ తదితరులు ఈ చిత్రంలో నటించారు.

ఈ రోజు ఈ చిత్రం నుండి ‘మా ఊరు శ్రీకాకుళం’ అనే పాట విడుదల అయింది. సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి ఈ పాట లిరిక్స్ అందచేయగా మంగలి ఈ పాట పాడారు. ‘చారి 111’ సినిమా తరువాత వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఇది. శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్ నుండి వస్తున్న ఈ సినిమా పాటలను ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని లాస్య రెడ్డి ప్రెసెంట్ చేస్తుండగా ఈ సినిమాలోని పాటల లిరిక్స్ రామ జోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యాం, పూర్ణ చారి అందించారు.