600 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లనున్నారు

2010లో వచ్చిన హిందీ హిట్ మూవీ హౌజ్ ఫుల్, అక్షయ్ కుమార్ రితేష్ దేశముఖ్ హీరోలుగా వచ్చిన ఈ కామెడీ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ అయ్యింది. ఇదే కోవలో హౌజ్ ఫుల్ సిరీస్ లో ఇప్పటి వరకూ మూడు సినిమాలు వచ్చాయి. ప్రతి సినిమా ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ గా తెరకెక్కి ప్రేక్షకులని అలరించినవే. ఇప్పుడు ఈ సిరీస్ లో నాలుగో సినిమా హౌజ్ ఫుల్ 4 ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతోంది. అక్షయ్ కుమార్, రితేష్, బాబీ డియోల్, కృతి సనన్, పూజ హెగ్డే మెయిన్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని రిలీజ్ చేశారు. కొత్తగా డిజైన్ చేసిన ఈ పోస్టర్ నెటిజెన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. 1419 నుంచి 2019 మధ్య అంటే 600 ఏళ్ల కాల వ్యవధితో రూపొందిన ఈ సినిమాని ఫర్హాద్ సంజి దర్శకత్వం వహిస్తున్నాడు. సాజిద్ నదియావాలా నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకి రానుంది.