అసురన్ హిట్ కొట్టాడు కాబట్టి ఈ మూవీకి ఇదే రైట్ టైం

హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో కథని న్యారేట్ చేస్తూ, కాప్ సినిమాలు ఎక్కువగా చేసే గౌతమ్ వాసుదేవ్ మీనన్ కి డైరెక్టర్ గా మంచి పేరుంది. దర్శకుడిగా సక్సస్ చూసిన గౌతమ్ మీనన్, ప్రొడ్యూసర్ గా మాత్రం ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. ఇప్పటికే మూడు సినిమాలు చేసి రిలీజ్ కష్టాలు ఫేస్ చేస్తున్న మీనన్, త్వరలో ఈ మూడింటిలో ఒకటి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ధనుష్ హీరోగా నటించిన ఎన్నై నోకి పాయుమ్ తూటా సినిమాని గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేస్తూ ప్రొడ్యూస్ చేశాడు. షూటింగ్ పనులు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకోని ఏడాది దాటుతున్నా కూడా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాలేదు.

dhanush

ఎన్నై నోకి పాయుమ్ తూటా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ధనుష్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ట్రైలర్, సాంగ్స్ అంటూ ఏడాదిగా వారిని ఊరిస్తూ వచ్చిన గౌతమ్ మీనన్ ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశాడు. నవంబర్ 29న ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం, ఆగిపోవడం అనేది గత కొంతకాలంగా జరుగుతూనే ఉంది. ఈసారి అయినా ఎన్నై నోకి పాయుమ్ తూటా ప్రేక్షకుల ముందుకి వస్తుందా లేదా అనేది చూడాలి. అసురన్ సినిమాతో ధనుష్ సూపర్ హిట్ అందుకున్నాడు కాబట్టే, ఏడాదిగా వాయిదా పడిన సినిమాని రిలీజ్ చేయడానికి ఇదే మంచి టైం. మరి దీన్ని గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఎంత వరకూ వాడుకుంటాడో చూడాలి.