దగ్గుబాటి రానా సమర్పణలో సినిమా – తిరుపతిలో ఏం జరిగింది?

తెలుగు వారి మదిలో ఎంతో ప్రియతమైన పుణ్యభూమిగా భావించబడే తిరుపతి నుండి ఓ కొత్త కథ సిద్ధమవుతుంది. దగ్గుబాటి రానా ఆ సినిమాను సమర్పిస్తుండగా నివేత థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమీత గారు ముఖ్య పాత్రలలో నటిస్తూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే #35 అంటూ ఈ సినిమాను ప్రకటించారు మేకర్స్. ’35 ~ చిన్న కథ కాదు’ అంటూ ఈ సినిమాను ప్రేక్షకులకు పరిచయం చేసారు. నంద కిషోర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. ఈ సినిమా ఆగష్టు 15న థియేటర్లలోకి రానున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ ప్రకటనకు సంబంధించి దగ్గుబాటి రానా ఓ ట్వీట్ కూడా చేసారు.