ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్పత్రికా ప్రకటన

ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కు నూతన అధ్యక్షుడిగా సురేష్ కవిరాయనిను నియమిస్తూ ఈసి సభ్యులు అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. శనివారం సాయంత్రం నిర్వహించిన ఈసీ సమావేశంలో సురేష్ కవిరాయని అధ్యక్షుడు గా బలపరుస్తూ సభ్యులు ఆమోదం తెలపడం జరిగింది. ఎఫ్ సి ఎ కు అధ్యక్షుడు గా ఉన్న సురేష్ కొండేటిని కొన్ని కారణాలు వల్ల ఈసీ సభ్యుల ఆమోదం మేరకు అధ్యక్ష పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన అధ్యక్షుడిగా సురేష్ కవిరాయనిను నియమిస్తూ ఈసి నిర్ణయం తీసుకోవడం జరిగింది.

ఎం. లక్ష్మి నారాయణ
ప్రధాన కార్యదర్శి
ఎఫ్ సి ఏ