
బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు వ్యతిరేకంగా ‘బాధ్యతా రహితమైన వ్యాఖ్యలు’ చేసినందుకు మీడియా ఛానెళ్లపై చిత్ర సంస్థలు మరియు నిర్మాతలు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో కోర్టు వరకు వెళ్ళడానికి సిద్దమైన బాలీవుడ్ పై కంగనా రనౌత్ ఊహించని విధంగాక్క్ ట్వీట్ చేశారు. కంగనా మళ్లీ బాలీవుడ్‌ను ‘గట్టర్’ అని పిలిచింది.
సినీ పరిశ్రమ పరువు తీసినందుకు 38 సినీ సంస్థలు, నిర్మాతలు కొన్ని మీడియా సంస్థలు, జర్నలిస్టులపై దావా వేసిన తరువాత కంగనా రనౌత్ ఊహించని విధంగా స్పందించారు. అలాగైతే తనపై కూడా కేసు పెట్టాలని కంగనా సరికొత్త వాదనతో కౌంటర్ ఇచ్చింది. “బాలీవుడ్ డ్రగ్స్, దోపిడీ, స్వపక్షం మరియు జిహాద్ యొక్క గట్టర్ ఈ గట్టర్ శుభ్రం చేయడానికి బదులుగా ఆపివేయబడింది. బాలీవుడ్ జనులరా నాపై కూడా కేసు పెట్టండి, నేను జీవించి ఉన్నంత వరకు నేను మీ అందరినీ బహిర్గతం చేస్తాను.. అని ఆమె ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చింది.
అలాగే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వంటి యువకులను పైకి రానివ్వరని, నేను పుట్టినప్పటి నుండి సినిమా కుటుంబాలకు చెందిన ఈ కొద్దిమంది పురుషులు మాత్రమే పరిశ్రమను నడుపుతున్నారని ఇది ఎప్పుడు మారుతుందని కంగనా మరో ట్వీట్‌లో పేర్కొంది