తెలుగు చలనచిత్ర ‘మహిళామణులకు’ సత్కారం !!

యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా(ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు చరిస్తారు)అన్న నానుడిని నిజం చేస్తూ 10-03-2022వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగు నిర్మాతల మండలి హాలులో దాసరి ఫిల్మ్ అవార్డ్స్ & నేస్తం ఫౌండేషన్ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చిత్రపరిశ్రమలోని వివిధ శాఖలకు చెందిన ప్రతిభ కల్గిన మహిళామణులను సీనియర్ దర్శకులు రేలంగి నరసంహారావు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, లయన్ సాయి వెంకట్, జె.వి.మోహన్ గౌడ్, డైరెక్టర్ బాబ్జీ చేతుల మీదుగా సన్మానించుకోవడము జరిగినది. సన్మాన గ్రహీతలు వీరే….

 1. శ్రీమతి శిఫాలీ కుమార్.. రీజనల్ ఆఫీసర్, CBFC, హైదరాబాద్
 2. శ్రీమతి హేమ… ప్రముఖ సినీ నటి
 3. సింగింగ్ స్టార్ విజయలక్ష్మి.. ప్రముఖ గాయకురాలు
 4. స్వర్ణ మాష్టర్… ప్రముఖ నృత్య దర్శకురాలు
 5. శ్రీమతి చెరువు విజయశ్రీ… ప్రముఖ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ
 6. శ్రీమతి కావూరి ఉమర్జి అనురాధ … ప్రముఖ సినీ కథా, మాటల రచయిత్రి
 7. కుమారి గౌరీ రోనాంకి… దర్శకురాలు (పెళ్ళిసందడి 2)
 8. శ్రీమతి నాగులపల్లి పద్మిని… నిర్మాత, తెలుగు ఛాంబర్ ఇ. సి. మెంబర్
 9. శ్రీమతి రాధా రాజేశ్వరి…
  నిర్మాత.. ప్రొడ్యూసర్ సెక్టార్ వైస్ చైర్మన్
 10. శ్రీమతి వి.వి.రుషిక
  నిర్మాత & డిస్ట్రిబ్యూటర్