ఈ ప్రాంచైజీలో మరో రెండు మాత్రమే…

జేమ్స్ బాండ్ మూవీస్ తర్వాత ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన యాక్షన్ సిరీస్ ఏదైనా ఉందా అంటే అది ఫాస్ట్ అండ్ ఫురియస్ సిరీస్ మాత్రమే. రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో మొదలైన ఈ సిరీస్ నెమ్మదిగా సూపర్ హీరో సినిమాలకి పోటి ఇచ్చే స్థాయికి ఎదిగింది. యాక్షన్, గ్లామర్, రోమాన్స్, ఫ్రెండ్షిప్ అన్నీ బాలన్స్ చేస్తూ వచ్చిన ఈ సిరీస్ లో ఇప్పటివరకూ 8 సినిమాలు వచ్చాయి. ఒకదాన్ని మించి మరొకటి హిట్ అయిన ఈ సిరీస్ నుంచి 9వ సినిమా ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్దమవుతోంది. wwe ఫైటర్ జాన్ సీనా విలన్ గా నటిస్తున్న ఈ లేటెస్ట్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యి ఫయాస్ట్ అండ్ ఫురియాస్ స్టాండర్డ్స్ ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది. సిని అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ని కరోనా కారణంగా డిలే చేస్తూ వస్తున్నారు. ఈ నెలలో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా లేటెస్ట్ రిలీజ్ డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు.  

ప్రస్తుతం ఈ ఫ్రాంఛైజీలో 10 మరియు 11 చిత్రాలు తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించారు మూవీ మేకర్స్. ఎఫ్ 9 సిరీస్‌ను జస్టిన్ లిన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సిరిస్‌లో 10 మరియు 11 చిత్రాల తర్వాత ఈ ఫ్రాంఛైజీకి ముగింపు పలకబోతున్నట్టు హీరో విన్ డీజిల్ ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. విన్ డీజిల్ మాట్లాడుతూ.. ఏదైనా కథకు ఎక్కడో ఒక చోట ముగింపు పలకాల్సిందే. 2003లో విడుదలైన ఈ సిరీస్‌లో చివరిది 11వ ఫ్రాంఛైజీ 2023లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు మూవీ మేకర్స్. మొత్తంగా 20 యేళ్ల ఈ సిరీస్‌కు త్వరలో ఎండ్ కార్డ్ పడనుంది.