
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలు దేవర 2, వార్ 2, ఎన్టీఆర్ నీల్. ప్రస్తుతానికి వార్ 2 చిత్రంలో విలన్ గా నటిస్తుండగా అది పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్ నీల్ అనే వర్కింగ్ టైటిల్ తో ఉన్న చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నట్లు ప్రస్తుత సమాచారం. ఇది ఇలా ఉండగా ఈ చిత్రాలను పూర్తి అయిన తర్వాత దేవర 2 చిత్ర షూటింగ్ ప్రారంభం కానున్నట్లు శని వర్గాలలో వినిపిస్తున్న వార్త. అయితే ఈనెల 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ నీల్ చిత్ర గ్లింప్స్ విడుదల కాలున్నట్లు సమాచారం. అంతేకాక అదే రోజున వార్ 2 చిత్రం నుండి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ విడుదల కానుందని బాగా వినిపిస్తున్న వార్త. ఈ వార్తలు కనుక నిజమై ఈ రెండు ఈ అప్డేట్స్ వస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కన్నుల పండుగ అని చెప్పుకోవాలి.