Pavan-Krish: ప‌వ‌న్ లుక్ డిజైన్ చేసిన అభిమాని ‌.. డైరెక్ట‌ర్ క్రిష్ ఫిదా!

Pavan-Krish: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ క్రిష్ కాంబినేష‌న్‌లో పీఎస్‌పీకే27 వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంకు సంబంధించి ఫ‌స్ట్‌లుక్‌, టైటిల్‌ను మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా మార్చి 11న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం వెల్ల‌డించింది. అయితే ఈ నేప‌థ్యంలో ఓ అభిమాని డిజైన్ చేసిన ప‌వ‌న్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ లుక్‌లో ప‌వ‌న్ త‌ల‌పాగా క‌ట్టుకుని గ‌డ్డంతో ఎంతో ఆక‌ట్టుకునేలా ఉన్నాడు. దీంతో ఈ లుక్‌ను చూసిన డైరెక్ట‌ర్ క్రిష్ ఎంతో ఫిదా అయ్యాడు..

Pavan Look

దీనికి సంబంధించిన ఆ లుక్‌ను త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా పోస్ట్ చేస్తూ.. వావ్ .. ఫ్యాన్ మేడ్ డిజైన్ చేసిన ఈ లుక్ నిజంగా ఎంతో అద్భుతంగా ఉందని క్రిష్ ట్విట్ చేశాడు. ఇక Pavan-Krishఈ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే ఈ చిత్రంలో ఓ కీల‌క‌పాత్ర‌కోసం బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్‌ఫెర్నాండేజ్ తీసుకున్నారు చిత్ర‌బృందం. బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు అర్జున్ రాంపాల్ కూడా ఈ చిత్రంలో న‌టిస్తున్నాడు. ఇక Pavan-Krishఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత ఏ.ఎమ్‌.ర‌త్నం నిర్మిస్తుండ‌గా.. ఎం.ఎం.కీర‌వాణీ ఈ చిత్రానికి స్వ‌రాలు అందిస్తున్నారు.