ప్రముఖ దర్శకుడు కె.ఎస్ నాగేశ్వరరావు మృతి !!

క్యారెక్టర్ ఆర్టిస్టు గా, విలన్ గా అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీహరి ని హీరోగా పరిచయం చేస్తూ.. పోలీస్, దేవా, సాంబయ్య చిత్రాలను రూపొందించి హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు కె. ఎస్ నాగేశ్వరరావు.. ఆతర్వాత శ్రీశైలం, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి తో వైజయంతి చిత్రాలను రూపొందించి మాస్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న కె.ఎస్ నాగేశ్వరరావు రీసెంట్ గా బిచ్చగడా మజాకా” చిత్రాన్ని తెరకెక్కించారు.

గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంభందించిన వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు.. నిన్న నవంబర్ 26న ఏలూరు నుండి తిరిగి వస్తూ.. ఫిట్స్ వచ్చి అకస్మాత్ గా కుప్పకూలిపోయారు.. వెంటనే ఆయన్ను దగ్గరలో వున్న హాస్పటల్ కు హుటా హుటిన తరలించారు. చికిత్స పొందుతూ ఆయన నిన్న సాయంత్రం మృతి చెందారు.. ఇవాళ ఆయన స్వస్థలం అయిన కోయిలగుడేం దగ్గరలో వున్న పోతవరంలో నేడు ఉదయం అంత్యక్రియలు జరగనున్నాయి..