‘హిట్ 3’కి ఫ్యామిలీ ఆడియన్స్ రెస్పాన్స్ : డైరెక్టర్ శైలేష్ కొలను

నేచురల్ స్టార్ నాని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్  HIT: ది 3rd కేస్. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు.  మే 1న పాన్ ఇండియా గ్రాండ్ గా రిలీజ్ అయిన HIT: The 3rd Case అందరినీ ఆకట్టుకొని బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.  ఈ సందర్భంగా డైరెక్టర్ శైలేష్ కొలను విలేకరలు సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

నాని గారిని ఎంత వైలెంట్ గా చూపించాలని దసరా చూసిన తర్వాత అనిపించిందా?
-హిట్ సెకండ్ పార్ట్ లోనే నాని గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చివర్లో ఒక గ్లింప్స్ లాగా చూపించా.  అర్జున్ సర్కార్ ఎలా ఉంటాడో అప్పుడే ఆడియన్స్ కి ఒక అవగాహన వచ్చింది. ఈ తరహా పాత్రకు ఎలాంటి క్యారెక్టరైజేషన్ కావాలో అలా డిజైన్ చేయడం జరిగింది.

-ఈ సినిమాకి ఒక టార్గెట్ ఆడియన్స్ ఉంటారని ముందు అనుకున్నాం. అయితే అర్జున్ సర్కార్ క్యారెక్టర్  లేడీస్ కి ఎక్కువగా నచ్చడం మాకు సర్ప్రైజింగ్ గా అనిపించింది అనిపిస్తుంది. మేమైతే ఒక టార్గెట్ ఆడియన్స్ అనుకున్నాము. మా అంచనాలకు దాటి ఆడియన్స్ వస్తున్నారు. ముఖ్యంగా థియేటర్స్ లోకి ఫ్యామిలీస్ వచ్చేస్తున్నారు. పిల్లల్ని తీసుకురావడం లేదు. అదొక గుడ్ థింగ్.

-గత రెండు రోజులుగా థియేటర్స్ విజిట్ చేస్తున్నాం. చాలామంది లేడీస్ ధియేటర్స్ రావడం గమనించాం. బహుశా నాని గారిని అలాంటి డిఫరెంట్ క్యారెక్టర్జేషన్లో చూడడానికి ఒక ఎక్సైజ్మెంట్ వస్తున్నారు.

ఇంత వైలెంట్ క్యారెక్టర్ చెప్పినప్పుడు నాని గారి ఫస్ట్ రియాక్షన్ ఏంటి?
-ప్రిమైజ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కథ బాగా చెప్పగలిగితే అద్భుతంగా ల్యాండ్ అవుతుందని ముందే అనుకున్నాం. ఈ క్యారెక్టర్ మీద నాకు, నాని గారికి దటి నుంచి నమ్మకం వుంది. అది కరెక్ట్ ప్లేస్ లో ల్యాండ్ అయింది.ఆడియన్స్ రెస్పాన్స్ అద్భుతంగా ఉంది.

ఇందులో డార్క్ వెబ్ ని ఎక్స్ప్లోర్ చేశారు కదా.. దాని గురించి ?
-డార్క్ వెబ్ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సైబర్ డిపార్ట్మెంట్ దీని మీద వర్క్ చేస్తోంది. ఈ సినిమా కోసం కూడా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు చాలా హెల్ప్ చేశారు. డార్క్ వెబ్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.  

హిట్ 4లో  కార్తీ గారిని ఎలా చూపించబోతున్నారు ?
-క్యారెక్టర్ ఏంటి అనేది నాకు ఐడియా ఉంది. ఆల్రెడీ సినిమాలో చూపించాం తనకి క్రికెట్ అంటే ఇష్టం బెట్టింగ్స్ వేస్తుంటాడు. ఆ క్యారెక్టర్ కొంచెం రూటేడ్ గా ఉండబోతుంది. క్యారెక్టర్ లో ఫన్ కూడా ఉంటుంది.

రావు రమేష్ గారి గురించి?
-రావు రమేష్ గారు చాలా కైండ్. ఆయన హిట్ 2లో చేశారు. ఆ డివిజన్ కి అయిన హెడ్ కాబట్టి ఆ క్యారెక్టర్ నే చూపించాలి.  ఆయన కథ కూడా వినకుండా ఎంత చిన్న క్యారెక్టర్ అయినా వచ్చి చేస్తానని చెప్పారు. అలాగే సముద్రఖని గారు కూడా చిన్న క్యారెక్టర్ అయినప్పటికీ చాలా ఇంపాక్ట్ ఫుల్ గా చేశారు. ఆయన కనిపించిన ప్రతిసారి స్క్రీన్ మీద ఒక ఇంపాక్ట్ ఉంటుంది. ఇందులో కనిపించిన ప్రతి క్యారెక్టర్ ఒక పర్పస్ తో ఉన్నదే.

సినిమా క్లైమాక్స్ లో కొన్ని క్యామియోస్ ఉన్నాయి కదా.. విశ్వక్ గారిని చూపిస్తే ఎలా ఉండేది?
– కథలో ఒక క్యారెక్టర్ రావడం ఆర్గానిక్ గా ఉండాలి. హిట్ 6 లేదా 7 లో అందరి హీరోల్ని ఒక ఫ్రేమ్ లోకి తీసుకురావాలనే ఒక ఇమేజ్ నాకు ఉంది. విశ్వక్ ని ఇంకా బిగ్గర్ కాన్వాస్ లో చూపించాలనే ఆలోచన వుంది.

చాగంటి వారి వాయిస్ ఎవరి గురించి ?
-చాగంటి గారి వాయిస్ ఓవర్ వాడడం వలన సినిమాకి ఒక ఇంట్రెస్టింగ్ టింజ్ వచ్చింది. నిజంగా క్వైట్ కాంట్రస్ట్ ఇమేజ్ కి ఆ వాయిస్ వాడడం ఒక గూస్ బంప్ మూమెంట్. ఈ సినిమా ఐడియా చాగంటి గారికి చెప్పాను. ఆయనకి నచ్చి ఆ వాయిస్ ఇచ్చారు.

వెంకటేష్ గారితో మరో సినిమా చేసే ఆలోచన ఉందా?
-వెంకటేష్ గారితో మరో సినిమా చేసి ఆయనకి ఒక పెద్ద హిట్ ఇవ్వాలనే కోరిక ఉంది. ఆయన నాకు చాలా ఇష్టమైన మనిషి.  సినిమా రిలీజ్ అయిన తర్వాత వెంకటేష్ గారు నాతో ప్రతిరోజు ఫోన్లో మాట్లాడేవారు. మా అబ్బాయి ఉంటే వెంకటేష్ గారికి ఇష్టం. మా అబ్బాయి వీడియోలు ఫోటోలు వెంకటేష్ గారికి సెండ్ చేస్తుంటాను. ఆయన కూడా రిప్లై ఇస్తుంటారు. మా మధ్య సినిమాకి మించిన బాండింగ్ ఏర్పడింది.  

హీరోయిన్ శ్రీనిధి శెట్టి గురించి?
నేను అనుకున్న క్యారెక్టర్ కి శ్రీనిధి శెట్టి యాప్ట్.  తను అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. ఆమె పెర్ఫార్మెన్స్ ని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు.

నెక్స్ట్ సినిమా ఇంతకంటే వైలెంట్ గా ఉంటుందా?
-హిట్ ఫ్రాంచైజీలో ఆ కథకి ఏది అవసరమో ఆ ఎలిమెంట్ ని చేసుకుంటూ వెళ్లడం నా ఉద్దేశం. హిట్ వన్ కంప్లీట్ గా ఇన్వెస్టిగేషన్.
 హిట్2 ఒక సైకో కిల్లర్ చుట్టూ నడిచే కథ. హిట్ 3 ఒక నేషనల్ లెవెల్ క్రైమ్. ప్రతి మూమెంటు విజిల్ కొట్టేలాగా ఉండాలనే ఉద్దేశంతో రాసిన సినిమా ఇది. హిట్ 4 వేరే ఎలిమెంట్స్ తో ఉండొచ్చు.

మిక్కిజే మేయర్ గురించి ?
మిక్కీ జే మేయర్ గారు ఈ సినిమాకి పర్ఫెక్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేశారు. మ్యూజిక్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది.  సౌండ్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది.

పెహల్గామ్ లో  ఈ సినిమా షూట్ చేశారు కదా..ఇప్పుడు అక్కడ ఒక విషాదకరమైనటువంటి దుర్ఘటన జరిగింది..ఎలా అనిపిస్తుంది ?
-పెహల్గామ్ అంటే మనసులో ఒక అందమైన అనుభూతి. మేము అక్కడ ఒక రెండు కిలోమీటర్ల దూరంలోనే కొన్ని బ్యూటిఫుల్ విజువల్స్ ని షూట్ చేశాం.  ఇలాంటి దారుణమైన ఘటన జరగడం మనసును కలిచివేసింది. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి.

నాని గారు ప్రొడ్యూసర్, హీరో అవడం మీకు ఎంత మేరకు కలిసి వచ్చింది?
చాలా కలిసొచ్చింది. ఆయనకి సినిమాకి ఏం కావాలో తెలుసు. వాల్ పోస్టర్ నాకు హోం బ్యానర్లు లాంటి  ప్రొడక్షన్ హౌస్.

మీ సినిమాల్లో ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ చాలా డీటెయిల్ గా ఉంటుంది.. దానికి కారణం?
నేను సిడ్నీలో చదువుకుంటున్న రోజుల్లో ఒక లైబ్రరీ ఉండేది. చాలా పుస్తకాలు అక్కడ అందుబాటులో ఉండేవి. ఖాళీ సమయంలో క్రైమ్ సంబంధించిన చాలా పుస్తకాల్ని చాలా క్షుణ్ణంగా చదువుకున్నాను. ఆ నాలెడ్జ్ ఈ డీటెయిల్ కి ఉపయోగపడుతుందని భావిస్తున్నాను.  

మీరు ఏదైనా ఒక డిఫరెంట్ జానర్ లో సినిమా రాయాలని చూస్తున్నారా?
-నెక్స్ట్ మూడు నాలుగు నెలలు సిడ్నీలో కూర్చుని ఒక రొమాంటిక్ కామెడీ రాసుకోవాలని ఉంది. నా లోపల ఉన్న కామెడీని బయటికి తీసుకొచ్చి ఏదో ఒకటి రాయాలని ఉంది.  మరి అది ఎంతవరకు కుదురుతుందో చూడాలి.