జూనియర్ ఎన్టీఆర్ కు యాక్సిడెంట్ అంటూ వస్తున్న వార్తలు అబధం అంటూ పిఆర్ టిమ్ ఖండించింది. ఎన్టీఆర్ కార్యాలయం నుంచి సురక్షితంగా ఉన్నారని ఓ ప్రెస్ నోట్ కూడా విడుదల చేయడం జరిగింది. ఎన్టీఆర్ కి రోడ్డు ప్రమాదం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దు అటు ఆ పత్రిక ప్రకటన ద్వారా తెలపడం జరిగింది.
నిజానికి ఎన్టీఆర్ జిమ్ లో వర్కవుట్ చేస్తుండగా ఎడమ చేతి మణికట్టుకు స్వలపాగాయం కావడం జరిగింది. గాయంతో ఉన్న ఫొటో విడుదల కాగా ఆక్సిడెంట్ అనే కథనాలు నెట్ లో వైరల్ అయ్యాయి. కానీ అది పూర్తిగా అబద్ధం. మణికట్టు గాయంతోనే నిన్న రాత్రి ఎన్టీఆర్ దేవర చిత్రీకరణ పూర్తి చేయడం జరిగింది. గాయం కారణంగా ఎన్టీఆర్ రెండు వారాలు సినిమాల నుంచి విశ్రాంతి తీసుకుంటారు.