F3 రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

వెంకటేష్-వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో అనిల్ రావిపూడి తెరకెక్కించిన F2 ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఇండియన్ పనోరమా అవార్డును కూడా గెలుచుకుంది. ఇప్పుడు F2కి సీక్వెల్‌గా F3 తెరకెక్కుతోంది. F2లో నటించిన నటీనటులే F3లో నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన F3 పోస్టర్లు సోషల్ మీడియాలో ట్రెండింగ్ సృష్టించాయి.

F3 RELEASE AUGUST 27TH

ఈ క్రమంలో తాజాగా F3 రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్టు 27న విడుదల చేయనున్నట్లు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తుండగా… దేశీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తమన్నా, మెహ్రీన్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. F2 సూపర్ హిట్ కావడంతో.. F3 కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.