F3 Movie: ఎఫ్3లో వెంక‌టేశ్ తండ్రిగా థియేట‌ర్ ఆర్టిస్ట్‌..

F3 Movie: విక్ట‌రీ వెంక‌టేశ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతున్న చిత్రం ఎఫ్‌-3. ఇందులో వెంక‌టేశ్ తో పాటు మెగా ప్రిన్స్ కూడా న‌టిస్తున్నార‌నే విష‌యం తెలిసిందే. స్టార్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని రూపొందిస్తుండ‌గా.. త‌మ‌న్నా, మెహ్రీన్ పిర్జాదీ హీరోయిన్లుగా న‌టించారు. ఇక వీరి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన‌ ఎఫ్‌-2 చిత్రం థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కులు క‌డుపుబ్బా న‌వ్వులు పూయించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజయం అందుకుంది.

అయితే ఈ చిత్రానికి సీక్వెల్‌గా వ‌స్తోన్న ఎఫ్-3 చిత్రం అంత‌కంటే రెట్టింపుగా న‌వ్వులు పూయించ‌డానికి రెడీ అయ్యారు విక్ట‌రీ వెంక‌టేశ్, మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్‌. ఈ క్ర‌మంలో ఈ చిత్రంలో వెంక‌టేశ్ తండ్రి పాత్ర‌లో థియేట‌ర్ ఆర్టిస్ట్ గోప‌రాజు ర‌మ‌ణ‌ను డైరెక్ట‌ర్ అనిల్ తీసుకున్న‌ట్లు స‌మాచారం. గోప‌రాజు ర‌మ‌ణ మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రంలో న‌టించి ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఎంతో గుర్తింపు న‌టుడు గోప‌రాజు ర‌మ‌ణ‌ను F3 Movie వెంక‌టేశ్ తండ్రి పాత్ర కోసం ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో విక్ట‌రీ వెంక‌టేశ్ జోడీగా త‌మ‌న్నా కాగా.. వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న మెహ్రీన్ పిర్జాదీ న‌టిస్తున్నార‌ని విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండ‌గా.. దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి స్వ‌రాలు అందిస్తున్నారు.‌