‘ఆదిపురుష్’ అప్డేట్ ఇచ్చిన ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించనున్న ఆదిపురుష్ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్‌ను ప్రభాస్ ఇచ్చాడు. ఈ సినిమా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వర్క్ ఈ రోజు స్టార్ట్ అయిందంటూ ఒక పోస్టర్‌ను ప్రభాస్ సోషల్ మీడియాలో విడుదల చేశాడు. ఈ టెక్నాలజీని హాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక ఇండియన్ సినిమాకు ఈ టెక్నాలజీ ఉపయోగిస్తుండటంతో.. ఆదిపురుష్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

adipurush update from prabhas

ఇక ఫిబ్రవరి 2న ఆదిపురుష్ సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది ఆగస్ట్ 11న ఈ సినిమాను విడుదల చేయనునున్నట్లు గతంలో సినిమా యూనిట్ ప్రకటించింది. టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్‌ కుమార్‌, కృష్ణన్‌ కుమార్‌లతో పాటు ఓం రౌత్‌, ప్రసాద్‌ సుతార్‌, రాజేష్‌ నాయర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.