ఈవిల్‌ లైఫ్‌ ట్రైలర్‌ విడుదల

ఈవిల్‌ లైఫ్‌ ట్రైలర్‌ విడుదల
వెంకట్‌ హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఈవిల్‌ లైఫ్‌’. రాణి స్వాతి కథానాయిక. బ్లూ మౌంటెన్‌ మూవీస్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్‌ను శుక్రవారం టి.ప్రసన్నకుమార్‌ విడుదల చేశారు. రామసత్యనారాయణ, ఆచంట గోపీనాథ్‌ పాటల్ని విడుదల చేశారు. ప్రన్నకుమార్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేయడం ఆనందంగా ఉంది. ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉంది. హీరో, దర్శకత్వం, ప్రొడక్షన్‌ అన్ని తానే అయ్యి సింగిల్‌ షెడ్యూల్‌లో ఈ చిత్రాన్ని కంప్లీట్‌ చేశాడు వెంకట్‌. మారుతి తీసిన ప్రేమకథాచిత్రమ్‌ ఎలాగైతే సింపుల్‌గా హిట్‌ అయిందో ఈ చిత్రం కూడా అలాగే హిట్‌ అవుతుంది. హారర్‌ బ్యాక్‌డ్రాప్‌లో వున్న ఈ సినిమాలో చక్కని ఫీల్‌ ఉంటుంది. వైజాగ్‌ శంకర్‌ ఈ సనిమాను విడుదల చేయడానికి ముందుకొచ్చారు’’ అని అన్నారు.

హీరో, దర్శకనిర్మాత వెంకట్‌ మాట్లాడుతూ ‘‘మా ఈవిల్‌ లైఫ్‌ సినిమా ట్రైలర్‌ లాంచ్‌కి వచ్చిన ప్రసన్నకుమార్‌, రామసత్యనారాయణ, ఆచంట గోపినాథ్‌, కర్రి బాలాజీ తదితరులకు కృతజ్ఞతలు. సినిమా అంటే ప్యాషన్‌తో ఇండస్ట్రీలోకి వచ్చా. అన్ని నేనే అయ్యి సినిమా పూర్తి చేశా. వైజాగ్‌ పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ చేశా. మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని అన్నారు.

కర్రి బాలాజి మాట్లాడుతూ ‘‘బ్యాక్‌ డోర్‌’ సినిమాకు థియేటర్లు దొరకకపోతే శంకర్‌గారు ధైర్యంగా విడుదల చేశారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని కూడా భుజాన వేసుకుని విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు’’ అని అన్నారు.
రామ సత్యనారాయణ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా కాపీ చూశాను చాలా బావుంది. వైజాగ్‌ ప్రాంతంలో చిన్న సినిమాల పాలిట దేవుడులాంటి వ్యక్తి శంకర్‌. ఈ సినిమా బాధ్యతను కూడా ఆయన తీసుకున్నారు’ అని అన్నారు
గౌతంరాజు మాట్లాడుతూ ‘‘ఆంధ్రాలో సినిమా ఇండస్ట్రీ ఇంకా ఎదగాలని కోరుకుంటున్నా. ఈ సినిమా ట్రైలర్‌ నచ్చింది’’ అని అన్నారు. ‘‘సినిమా మీద ప్యాషన్‌ ఉన్నవాళ్లంటే నాకెంతో ఇష్టం. అందుకు పాటను విడుదల చేయడానికి వచ్చాను’’ అని అచంట గోపినాథ్‌ అన్నారు.
శ్యామలా, అంజి, లతా, రాము తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: బీఎస్‌ కుమార్‌–ఎస్‌.ఎస్‌. కుమార్‌, సంగీతం: దిలీప్‌, పీఆర్వో: వెల్లూరి మధు.