35 ఏళ్ల తర్వాత కూడా చిరంజీవి చిత్రానికి అంతే క్రేజ్

వైజయంతి మూవీస్ బ్యానర్ పై కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1990 మే 9వ తేదీన మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం జగదేకవీరుడు అతిలోకసుందరి. ఈ చిత్రం అప్పట్లో ఒక సెన్సేషన్గా నిలిచింది. చిత్రంలోని నాటి విజువల్స్ మాత్రమే కాకుండా పాటలు ఇంకా దానికి తగ్గట్లు చిరంజీవి స్టెప్స్ అభిమానులను కేరింతలు పెట్టాలా చేశాయి. అయితే 35 సంవత్సరాలు తర్వాత 2025 మే 9వ తేదీన అనగా అదే రోజున మరోసారి ఈ చిత్రం రీ రిలీజ్ అవుతూ ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. దీనితో మెగా అభిమానులు లేకుండా ఇది తెలుగు రాష్ట్రాలలోని ప్రతి సినిమా అభిమాని ఈ చిత్రాన్ని వీక్షించేందుకు మరోసారి థియేటర్లకు వస్తున్నారు. నేటి కొత్త సినిమాలకు పోటీగా ఈ చిత్ర టికెట్ బుకింగ్స్ కావడం మరొక విశేషం. గత కొన్ని సంవత్సరాలుగా ఈ చిత్రం మరోసారి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మరింత క్లారిటీతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో వైజయంతి సంస్థ వారు ఎంతో శ్రమించి ఈ చిత్రానికి సంబంధించిన రీల్స్ ను సంపాదించారు. అయితే వాటి అంతటినీ కలిపి నేటి టెక్నాలజీతో 2D ఇంకా 3Dలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో విజయం సాధించారు. చిరంజీవి సెన్సేషనల్ హిట్ అయిన ఈ చిత్రం కోసం నేడు ప్రేక్షకులంతా తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ చిత్రాన్ని థియేటర్లో వీక్షించేందుకు క్యూలు కడుతున్నారు. ఇక ఈ చిత్ర రీడింగ్ సంబంధించిన కలెక్షన్స్ అఫీషియల్ గా నిర్మాణ సంస్థ వారు బయటపెట్టాల్సిందే.