టాప్ సినిమాటోగ్రాఫర్ కన్నుమూత

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఫైఎస్ నివాస్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. తాజాగా మరణించారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.

ps nivas passed away

1977లో విడుదలైన మలయాళం సినిమా మెహినీఘట్టం సినిమాతో సినిమాటోగ్రాఫర్‌గా ఫైఎస్ నివాస్ మంచి గుర్తింపు పొందారు. ఇక కమల్ హాసన్ హీరోగా కె.విశ్వనాథ్ తెరకెక్కించిన సాగర సంగమం సినిమాకి ఆయన పనిచేశారు. పదహారేళ్ల వయస్సు, వయసు పిలిచింది, ఓం శాంతి లాంటి ఎన్నో హిట్ సినిమాలకు ఆయన సినిమాటోగ్రఫర్‌గా పనిచేశారు. ఉత్తమ సినిమాటోగ్రఫర్‌గా అనేక జాతీయ అవార్డులు గెలుచుకున్న ఆయన.. దర్శకుడు, నిర్మాతగా మారి అనే సినిమాలను తెరకెక్కించారు.