“అమరావతికి ఆహ్వానం” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఎస్త‌ర్‌

ప్ర‌స్తుత కాలంలో హార‌ర్ థ్రిల్ల‌ర్ సినిమాల‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ మ‌ధ్యే బాలీవుడ్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన ముంజ్య, స్త్రీ 2 సినిమాలే దానికి ఉదాహ‌ర‌ణ‌…అలాంటి ఒక ఉత్కంఠ‌భ‌రిత‌మైన క‌థ, క‌థ‌నాల‌తో సీట్ ఎడ్జ్ హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న చిత్రం అమరావతికి ఆహ్వానం. అక్క‌డొక‌డుంటాడు ఫేమ్ శివ కంఠంనేని, ఎస్త‌ర్‌, ధ‌న్య‌బాల‌కృష్ణ‌, సుప్రిత, హ‌రీష్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్న ఈ మూవీకి టాలెంటెడ్ రైట‌ర్‌, డెరెక్ట‌ర్ జివికె ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఉగాది సంద‌ర్భంగా ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశారు మేక‌ర్స్‌. టైటిల్‌తోనే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్టర్‌ని గ‌మ‌నిస్తే..లీడ్ యాక్ట‌ర్స్ అంద‌రూ బ్లాక్ డ్రెస్ వేసుకుని
సీరియ‌స్‌ లుక్‌లో క‌నిపిస్తున్నారు. ఫేస్ లు పూర్తిగా రివీల్ కాన‌ప్ప‌టికీ అంద‌రి క‌ళ్ల‌లో ఒకేర‌క‌మైన ఇంటెన్సిటీ ఉంది.
ఒక‌ మంచి హార‌ర్ థ్రిల్ల‌ర్ కి కావాల్సిన మూడ్‌ పూర్తిగా క్యారీ అయింది. క్రియేటివ్‌గా ఉన్న‌ ఫ‌స్ట్ పోస్ట‌ర్ తోనే సినిమా ఎలా ఉండ‌బోతుంది అనే హింట్ ఇచ్చారు మేక‌ర్స్‌. ప్ర‌స్తుతం ఈ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌కి సోష‌ల్ మీడియాలో భారీ స్పంద‌న ల‌బిస్తోంది. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేన‌ర్‌పై కేఎస్ శంక‌ర్‌రావు, ఆర్ వెంక‌టేశ్వ‌ర రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జే ప్ర‌భాక‌ర్‌రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌. ప‌ద్మ‌నాభ‌న్ బ‌రద్వాజ్ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా సాయిబాబు త‌లారి ఎడిటింగ్ భాద్య‌త‌లు చేపట్టారు. యాక్ష‌న్‌ ఎపిసోడ్స్ అంజీ మాస్ట‌ర్ కంపోజ్ చేశారు. త్వ‌ర‌లో ఈ మూవీ నుండి మ‌రిన్ని స‌ర్‌ప్రైజింగ్ అప్‌డేట్స్‌ను ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్‌.

తారాగణం : శివ కంఠంనేని, ఎస్త‌ర్‌, ధ‌న్య బాల‌కృష్ణ‌, సుప్రిత‌, అశోక్ కుమార్‌, హ‌రీష్‌, భ‌ద్ర‌మ్‌, జెమినీ సురేష్ తదితరులు.

క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: జివికె
బేన‌ర్‌: లైట్ హౌస్ సినీ మ్యాజిక్‌
నిర్మాత‌లు: కెఎస్ శంక‌ర్‌రావు, ఆర్ వెంక‌టేశ్వ‌ర‌రావు
డిఓపి: జె ప్ర‌భాక‌ర్ రెడ్డి
మ్యూజిక్‌: ప‌ద్మ‌నాభ‌న్ భ‌రద్వాజ్‌
ఎడిటింగ్‌: సాయిబాబు తలారి
ఫైట్స్‌: అంజి మాస్ట‌ర్
లిరిక్స్‌: ఉమా వంగూరి
కొరియోగ్ర‌ఫి: రాజ్‌ కృష్ణ‌
పిఆర్ఓ: సిద్ధు