తెలుగు ఫిల్మ్ పీఆర్ఓ అసోసియేష‌న్‌ ఏర్పాటు !! ‌

అంద‌రికి న‌మ‌స్కారం.. గ‌త కొన్నేళ్లుగా అనుకుంటున్న పీఆర్ ఓ అసోసియేష‌న్ ఏర్పాటు ప‌నులు ఎట్ట‌కేల‌కు పూర్త‌య్యాయి. ఈ రోజు అసోసియేష‌న్ రిజిస్ట్రేష‌న్ స‌ర్టిఫికెట్‌ను కూడా అందుకున్నాం. సౌత్ ఇండియాతో పాటు అన్ని భాష‌ల్లో పీఆర్ ఓ ల‌కు ఓ అసోసియేష‌న్ వున్న‌ప్పుడు తెలుగు సినిమా పీఆర్ ఓల‌కు మాత్రం ఓ అసోసియేష‌న్ ఎందుకు వుండ‌కూడ‌దు అనే వుద్దేశంతో ఏర్పాటు చేసిన అసోసియేష‌న్ ఇది. తెలుగు ఫిల్మ్ ప్రెస్ రిలేష‌న్స్ ఆఫీస‌ర్స్ అసోసియేష‌న్ (తెలుగు ఫిల్మ్ పీఆర్ఓ అసోసియేష‌న్‌)
పేరిట ఏర్పాటు చేసిన ఈ సంస్థ‌కు ఇటీవ‌ల కార్య‌వ‌ర్గ క‌మిటీని కూడా ఎన్నుకుని రిజిస్ట్రేష‌న్‌ను పూర్తిచేశామ‌ని తెలియ‌జేయుట‌కు సంతోషిస్తున్నాం.
క్రింది స‌భ్యుల‌ను ఇటీవ‌ల జ‌రిగిన స‌మావేశంలో ఏక‌గ్రీవంగా ఎన్నుకోవ‌డం జ‌రిగింది.

పీఆర్ఓ అసోసియేష‌న్ క‌మిటీ స‌భ్యులు:
గౌర‌వ అధ్య‌క్షుడు: ఎ.ప్ర‌భు
ప్రెసిడెంట్‌: వంశీ కాక‌
జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రి: మ‌డూరి మ‌ధు
వైస్ ప్రెసిడెంట్‌: ప‌ర్వ‌త‌నేని రాంబాబు
జాయింట్ సెక్ర‌ట‌రి: పుల‌గం చిన్నారాయ‌ణ
ట్రెజ‌ర‌ర్‌: శ్రీ‌నివాస్ గాండ్ల
ఎగ్జిక్యూటివ్ క‌మిటి: ఏలూరు శ్రీ‌ను
తేజ‌స్వి స‌జ్జా

అసోసియేష‌న్‌కు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేస్తాం.