చరణ్-శంకర్ ప్రాజెక్ట్… రామ్ పోతినేనికి కలిసొచ్చింది…

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా ఆవారా, పందెంకోడి వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు ఎన్‌.లింగుసామి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.6గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో శ్రీ‌నివాసా చిట్టూరి నిర్మాత‌గా ఓ ఊర మాస్ చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ మూవీలో రామ్ స‌ర‌స‌న లేటెస్ట్ సెన్సేషన్ కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.

రామ్ పోతినేని కెరీర్‌లో 19వ మూవీగా తెలుగు, త‌మిళ భాష‌ల‌లో రూపోందుతోంది. స్టైలిష్ ఎలిమెంట్స్‌తో అవుట్-అండ్-అవుట్ మాస్ యాక్షన్ ఫిల్మ్ గా లింగుసామి ట్రేడ్‌మార్క్‌తో అల్ట్రా మాస్ చిత్రంగా ఉండబోతోంది. భారీ బడ్జెట్ తో, హై టెక్నికల్ వాల్యూస్ తో నిర్మిస్తున్న ఈ ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టాల్సిఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడింది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం సమకూర్చుతున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని జులై 12 నుండి షూటింగ్ మొదలవుతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే గతంలో డైరెక్టర్ లింగుస్వామితో ఒక సినిమా ఒప్పందం ఉన్న ప్రముఖ కోలీవుడ్ నిర్మాణ సంస్థ, ఒప్పందం ప్రకారం తమిళ సినిమా పూర్తయ్యాకే మరో సినిమా చేసేలా స్టే ఇవ్వమని కోర్ట్ ని ఆశ్రయించింది. దర్శకుడు శంకర్ కూడా లైకా ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇలాంటి సమస్యే ఎదురుకున్నాడు కానీ చెన్నై హైకోర్ట్ శంకర్ కి లైన్ క్లియర్ చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ సినిమా సెట్స్ పైకి వెల్తున్నట్లే… ఇప్పుడు రాపో-లింగుస్వామి సినిమా టీం కూడా షూటింగ్ స్టార్ట్ చేయడానికి సిద్దం అవుతుంది.