పరారి” మూవీ లో ఏమో ఏమో పాటను రిలీజ్ చేసిన లేడి సూపర్ స్టార్ విజయశాంతి.. మార్చి 30 న వరల్డ్ వైడ్ రిలీజ్

శ్రీ శంకర ఆర్ట్స్ బ్యానర్ లో, గాలి ప్రత్యూష సమర్పణలో, యోగేశ్వర్ అతిధి జంటగా, సాయి శివాజీ దర్శకత్వంలో, జివివి గిరి నిర్మించిన చిత్రం పరారీ..ఈ చిత్రం లోని ఏమో ఏమో సాంగ్ ని ప్రముఖ పొలిటీషియన్, లేడి సూపర్ స్టార్ విజయశాంతి గారు విడుదల చేశారు ఈ సందర్భంగా విజయశాంతి గారు మాట్లాడుతూ: యోగిశ్వర్ ఫస్ట్ ఫిలిం అయిన డాన్స్ బాగా చేసాడు. సక్సెస్ అవుతాడు ప్రజలందరూ యోగిని ఆశీర్వదించాలి. పరారీ సినిమాను కూడా అందరూ ఆదరించి పెద్ద సక్సెస్ చెయ్యాలి అని కోరుకుంటున్నాను.

నిర్మాత జి వి వి గిరి గారు మాట్లాడుతూ: మా పరారీ సినిమాలోని ఏమో ఏమో సాంగ్ ని విజయశాంతి గారు రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. పరారీ సినిమా మార్చి 30న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది అని అన్నారు.

సంగీత దర్శకుడు మహిత్ నారాయణ్ మాట్లాడుతూ: నేను రాసిన ఏమో పాటను విజయశాంతి గారు రిలీజ్ చేసి పాట చాలా బాగుంది అని అన్నారు. అలాగే మా హీరో యోగి బాగా డాన్స్ చేసాడు మంచి సక్సెస్ అవుతాడు అని చెప్పడం చాలా ఆనందంగా అనిపించింది. మాటిమ్ ను ఆశీర్వదించిన విజయశాంతి గారికి థాంక్స్..ఏమో ఏమో పాటను సాయి చరణ్, శురభి శ్రావణి పాడారు. పాటలు అన్ని బాగా వచ్చాయి. పాటలు అన్ని కూడా మార్కెట్లో రిలీజ్ అయ్యాయి..సినిమా మార్చి 30న రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా చూడండి అని అన్నారు

హీరో యోగిశ్వర్ మాట్లాడుతూ: ఈ రోజు మా పాటను విజయశాంతి గారు రిలీజ్ చేసి నన్ను నా డాన్స్ లను మెచ్చుకోవడం చాలా హ్యాపీ గా ఉంది. శంకర్ ఆర్ట్స్ బ్యానర్ లో నేను చేస్తున్న మొదటి సినిమా ఇది. మార్చి 30న రిలీజ్ అవుతుంది అని అన్నారు.

నటీ నటులు …
యోగిశ్వర్, అతిధి, సుమన్, భూపాల్, శివాని సైని, రఘు కారుమంచి, మకరంద్ దేశముఖ్, షయాజి షిండే, అలీ , శ్రవణ్, కల్పాలత, జీవ తదితరులు

సాంకేతిక నిపుణులు
నిర్మాత: జి వి వి గిరి,
దర్శకత్వం: సాయి శివాజీ
సంగీతం మహిత్ నారాయణ్,
లిరిక్ రైటర్స్: రామజోగయ్య శాస్త్రి, భాస్కర భట్ల, సినిమాటోగ్రఫీ; గరుడ వేగా అంజి,
ఎడిటర్ గౌతమ్ రాజు,
ఆర్ట్స్; ఆనంద్, కోటి అబలయ్,
యాక్షన్ :నందు,
కొరియోగ్రఫీ: జానీ, భాను,