మార్చి 5న “ఇది కల కాదు”

స్త్రీని దేవతగా కొలిచే మన భారత దేశంలో ప్రస్తుతం వారిని ఒక ఆట బొమ్మలుగా చూస్తున్నారు.మళ్ళీ మనమనందరం స్త్రీ ని గౌరవించే రోజులు రావాలని ఈ సందేశాత్మక చిత్రాన్ని తీశానంటున్నారు దర్శక,నిర్మాత అదీబ్ నజీర్. పరిందా ఆర్ట్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ పతాకంపై అదీబ్ నజీర్ ,దానికా సింగ్, షఫీ, బెనర్జీ, వైభవ్ సూర్య,పూజిత జొన్నలగడ్డ,డాక్టర్ శ్రీజ సాధినేని నటీనటులుగా అదీబ్ నజీర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం “ఇది కల కాదు”.అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మార్చి 5న విడుద‌ల ‌చేస్తున్నారు.ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలూ గా ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రెటరీ ప్రసన్న కుమార్, నిర్మాత సాయి వెంకట్, నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ,పద్మిని నగులపల్లి తదితరులు పాల్గొన్నారు. “ఇది కల కాదు” చిత్రంలోని, మోషన్ పోస్టర్, టీజర్ ను పాత్రికేయులకు ప్రదర్శించారు.అనంతరం

edi kala kadu release on march 5

ఈ చిత్ర దర్శక,నిర్మాత అదీబ్ నజీర్ మాట్లాడుతూ ..1995 నుండి నేను ఆర్టిస్ట్ గా వుంటూ చాలా సినిమాలలో నటించాను .ప్రముఖ దర్శకులు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి,లక్ష్మీ దీపక్ గార్లతో కలసి నటించాను.వారి వద్ద నేర్చుకున్న పాఠాలు ఈ సినిమాకు ఎంతో ఉపయోగపడ్డాయి.కొన్ని సినిమాలు చేసిన తరువాత గ్యాప్ తీసుకొని ఒక మంచి సందేశాత్మక సినిమా తీయలనే ఆలోచనతో ప్రస్తుత సమాజంలో స్త్రీ లపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాల ను దృష్టిలో పెట్టుకొని “ఇది కల కాదు” నిర్మించడం జరిగింది ఈ సినిమాకోసం ఆర్టిస్టులందరు ఏంతో కష్టపడి పని చేశారు.ఇందులో ఉన్న ఐదు పాటలు సన్నివేశానికి అనుగుణంగా వస్తాయి.కొన్ని సీన్స్ మన చుట్టుపక్కల జరిగిన సన్నీ వేషాలు గుర్తుకు తెస్తాయి.ప్రస్తుతం చాలామంది సందేశాత్మక సినిమాలు తియ్యడానికి ముందుకు రావడం లేదు.ఈ సినిమాలను ప్రేక్షకులు ఆదరించనందున ఇలాంటి సినిమాలు ఎందుకు తియ్యాలి,ఎవరు చూస్తారు అనుకుంటారు.కానీ ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీ తీస్తే తప్పక ఆదరిస్తారనే నమ్మకం నాకుంది. ఆ నమ్మకంతో తీసిన సినిమానే “ఇది కల కాదు” .ఈ సినిమాను మార్చి 5న విడుదల చేస్తున్నాం.ఈ చిత్రం ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా. సినిమా చూసిన ప్రేక్షకులందరు మమ్మల్ని అభినందిస్తారని అన్నారు.

ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రెటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ….సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ నజీర్ గారు ఈ సినిమాలో ప్రముఖ పాత్ర పోషిస్తూ దర్శక,నిర్మాతగా అన్నీ తానే అయి చేస్తున్న ఈ చిత్రం తనకు మంచి పేరు తీసుకు రావాలి.దేవినేని సినిమాలో వంగవీటి రాదా క్యారెక్టర్ చేస్తున్న బెనర్జీ, ఇద్దరి పెళ్లాల ముద్దుల పోలీస్ సినిమాలో హీరోయిన్ గా చేసిన పూజిత ,ఛత్రపతి ద్వారా విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకున్న షఫీ ఇలా మంచి మంచి అరిస్టులు నటిస్తున్న “ఇది కల కాదు” చిత్రం బాగా ఆడి నజీర్ కు మంచి పేరుతో పాటు డబ్బు రావాలని కోరుతున్నానని అన్నారు.

నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ …నజీర్ ఎప్పటినుండో మంచి సినిమా తీయాలని కల కనే వాడు.ఈ రోజు “ఇది కల కాదు” తో తన కలను నిజం చేసుకొన్నాడు.నజీర్ ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుచున్నానని అన్నారు.

నిర్మాత సాయి వెంకట్ మాట్లాడుతూ. 30 సంవత్సరాలుగా ఎన్నో సినిమాలలో నటించిన నజీర్ గారు తన అనుభవాన్నంతా ఈ చిత్రం ద్వారా చూయించారు. ట్రైలర్స్ చాలా బాగున్నాయి.ప్రెస్టీజ్ గా తీస్తున్న “ఇది కల కాదు” సినిమా తనకు మంచి పేరు తీసుకు రావాలని అన్నారు.

పద్మిని నగులపల్లి మాట్లాడుతూ ..అప్పట్లో వచ్చిన “ఇది కథ కాదు”సినిమా పెద్ద హీట్ అయ్యింది.ఇప్పుడు
అదే ట్రెండింగ్ తో వస్తున్న సినిమా “ఇది కల కాదు”.రెండు కూడా ప్రజెంట్ నేటివిటీకి అద్దం పట్టే చిత్రాలే. ఆ సినిమా లాగే ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నానని’ అన్నారు.