ఆగస్ట్ 23న “ఏదైనా జరగొచ్చు” విడుదల..

ఆగస్ట్ 23న వెట్ బ్రెయిన్ ఎంటర్‌టైన్మెంట్స్ ‘ఏదైనా జరగొచ్చు’ విడుదల.. 

నటుడు శివాజీ రాజా తనయుడు విజయ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ఏదైనా జరగొచ్చు. ఆగస్ట్ 23న ఈ చిత్రాన్ని విడుదల కానుంది. ఈ యాక్షన్ కామెడీ హార్రర్ థ్రిల్లర్‌ను కె రమాకాంత్ తెరకెక్కిస్తున్నారు. పూజా సోలంకీ, శశి సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

తమిళ నటుడు బాబీ సింహా కీలక పాత్రలో నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, నాగబాబు ఇతర సహాయ పాత్రల్లో నటిస్తున్నారు. ఏదైనా జరగొచ్చు పాటలు, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. శ్రీకాంత్ పెండ్యాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వెట్ బ్రెయిన్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ ఏదైనా జరగొచ్చు సినిమాను నిర్మిస్తున్నారు. 

నటీనటులు:
విజయ్ రాజా, బాబీ సింహా, పూజా సోలంకీ, శశి సింగ్, రవి శివ తేజ, వైవా రాఘవ, నాగబాబు, వెన్నెల కిషోర్, అజయ్ ఘోష్ తదితరులు 

సాంకేతిక నిపుణులు:

రచన, దర్శకుడు: K. రమాకాంత్ 
నిర్మాణ సంస్థలు: వెట్ బ్రెయిన్ ఎంటర్‌టైన్మెంట్, సుధర్మ్ ప్రొడక్షన్స్ 
సహ నిర్మాత: సుదర్శన్ హనగోడు
ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ ప్రకాశ్ అన్నామ్రెద్ది 
సంగీతం: శ్రీకాంత్ పెండ్యాల 
సినిమాటోగ్రఫర్: సమీర్ రెడ్డి 
ఎడిటర్: SB ఉద్ధవ్ 
మాటలు: వికర్ణ 
స్క్రీన్ ప్లే: కోటి బండారు, వేణుగోపాల్ రెడ్డి
ఆర్ట్ డైరెక్టర్: రమేష్
లిరిక్స్: ఇమ్రాన్ శాస్త్రి, ప్రణవ్ చాగంటి, అలరాజు 
PRO: వంశీ-శేఖర్