రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా, దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిల్మ్స్,ప్రఖ్యాత సురేష్ ప్రొడక్షన్స్ భాగస్వామ్యంతో, సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన మల్టీ లింగ్వెల్ ఫిల్మ్ “కాంత”ను నిర్మిస్తోంది. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్ లో నటించగా, భాగ్యశ్రీ ఫీమేల్ లీడ్ గా, సముద్రఖని కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంత ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దుల్కర్ సల్మాన్ 13 సంవత్సరాల చిత్ర పరిశ్రమలో అద్భుతమైన ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదల చేశారు
నిర్మాతలు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో దుల్కర్ సల్మాన్ ను కొత్త హెయిర్ స్టైల్ తో కూడిన సూట్ లో అద్భుతంగా, ఇంటెన్స్ అవతార్ లో కనిపించారు.
1950ల మద్రాస్ నేపథ్యంలో తెరకెక్కిన “కాంత” ఆ ఎరాలో మానవ సంబంధాలు, సామాజిక, సంక్లిష్టతలను ప్రజెంట్ చేస్తోంది.
దుల్కర్ సల్మాన్ 2012లో అరంగేట్రం చేసినప్పటి సక్సెస్ ఫుల్ గా కెరీర్ ని కొనసాగిస్తున్నారు. తన ప్రతిభ, అంకితభావంతో ప్రశంసలు అందుకున్నాడు. బెంగళూరు డేస్, కన్నుమ్ కన్నుమ్ కొలయాడితల్, ఓ కాదల్ కన్మణి, మహానటి & కురుప్ వంటి ప్రసిద్ధ చిత్రాల నుంచి సీతా రామం & లక్కీ భాస్కర్ వంటి ఇటీవలి భారీ విజయాలతో దూసుకుపోతున్నారు.
“కాంత సినిమాను అభిమానులకు చూపించడమే కాకుండా, దుల్కర్ సల్మాన్ 13వ సంవత్సరం సినీ జీవితంలో అద్భుతమైన మైలురాయిని జరుపుకుంటున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము” అని నెట్‌ఫ్లిక్స్‌లో గతంలో ‘ది హంట్ ఫర్ వీరప్పన్’ అనే డాక్యుమెంటరీ సిరీస్‌ను అందించిన చిత్ర దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ అన్నారు. “ఈ చిత్రం, నటుడి కెరీర్ లాగానే గొప్ప ప్రయాణాన్ని ప్రతిబింబిస్తుంది’ అన్నారు
ఈ సినిమా రానా దగ్గుబాటి నేతృత్వంలోని స్పిరిట్ మీడియా రూపంలో రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలను ఒకచోట చేర్చింది, ఇది అతని తాతగారు, దిగ్గజ డి. రామానాయుడు యొక్క అద్భుతమైన వారసత్వాన్ని ముందుకు తీసుకువెళుతుంది మరోవైపు, మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్ నేతృత్వంలోని వేఫేరర్ ఫిల్మ్స్ కూడా భాగమైయింది. భారతీయ సినిమాలో ఒక శతాబ్దానికి పైగా ఉన్న ఈ సమిష్టి వారసత్వం కలిసి వస్తోంది, వారి అద్భుతమైన ప్రతిభను, సామర్థ్యాలను తెరపైకి తీసుకువస్తోంది
అద్భుతమైన డిజైన్, బ్యాక్ డ్రాప్ తో ఈ పోస్టర్ అంచనాలను రేకెత్తిస్తుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. గొప్ప కథతో, కాంత తప్పనిసరిగా చూడవలసిన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ గా రూపొందుతోంది.
తారాగణం: దుల్కర్ సల్మాన్, సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: సెల్వమణి సెల్వరాజ్
బ్యానర్లు: స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్
నిర్మాతలు: రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – సాయికృష్ణ గద్వాల్
లైన్ ప్రొడ్యూసర్ – శ్రవణ్ పాలపర్తి
DOP – డాని శాంచెజ్ లోపెజ్
ఆర్ట్ డైరెక్టర్ – రామలింగం
రచయిత – తమిళ్ ప్రభ
సంగీతం – జాను
ఎడిటర్ – లెవెల్లిన్ ఆంథోనీ గోన్సాల్వేస్
కాస్ట్యూమ్ డిజైనింగ్: పూజిత తాడికొండ, సంజన శ్రీనివాస్
పీఆర్వో: వంశీ-శేఖర్