“డ్యూడ్” టైటిల్ నాది – తేజ్

డైరెక్టర్ టర్నడ్ హీరో ప్రదీప్ రంగనాథ్ తో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియా స్థాయిలు రూపొందించ తలపెట్టిన చిత్రానికి “డ్యూడ్” అనే పేరు ప్రకటించడం తనను ఆశ్చర్యానికి, ఆవేదనకు గురి చేసిందని అంటున్నారు. “డ్యూడ్” చిత్ర కథానాయకుడు – నిర్మాత – దర్శకుడైన తేజ్. ఏడాది నుంచి “డ్యూడ్” సినిమా ప్రచారాన్ని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. మైత్రి వంటి అగ్ర నిర్మాణ సంస్థతో ఘర్షణ పడే ఉద్దేశ్యం తనకు లేదని, ఈ విషయాన్ని ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ దృష్టికి తీసుకువెళ్లామని, వారు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నామని తేజ్ పేర్కొన్నారు.

తేజ్ నటిస్తూ కన్నడ – తెలుగు – మలయాళ భాషల్లో దర్శకత్వం వహిస్తున్న త్రిభాషా చిత్రం “డ్యూడ్”. ఫుట్ బాల్ నేపథ్యంలో బలమైన భావోద్వేగాలతో సాగే ఈ చిత్రాన్ని ఫుట్ బాల్ ప్రేమికుడైన స్వర్గీయ కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు అంకితం చేస్తున్నారు.

రంగాయన రఘు ఫుట్ బాల్ కోచ్ గా ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ చిత్రం లాస్ట్ షెడ్యూల్ త్వరలో స్టార్ట్ కానుంది. సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఆగస్టు లేదా సెప్టెంబర్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఏక కాలంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న రాఘవేంద్ర రాజ్ కుమార్… ఈ చిత్రానికి ‘స్క్రిప్ట్ కన్సల్టెంట్’గా కూడా వ్యవహరిస్తుడడం విశేషం. శాన్య కావేరమ్మ, మేఘ, మోహిత, ధృతి, అనర్ఘ్య, దిపాలి పాండే, సిరి, ఎవాంజిలిన్, సోను తీర్ధ గౌడ్, యశశ్విని, మెర్సి, మోనిష… ఫుట్ బాల్ అంటే పడి చచ్చే ధీర వనితలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సుందర్ రాజా, స్పర్శ రేఖ, విజయ్ చెందూర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

పనోరమిక్ స్టూడియోస్ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఒ: ధీరజ్ – అప్పాజీ, “జింకే మారి” ఫేమ్ ఎమిల్ మహమ్మద్ సంగీత సారధి. “అలా మొదలైంది” ఫేమ్ ప్రేమ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. నిర్మాణం: పనోరమిక్ స్టూడియోస్, కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: తేజ్.