‘‘వకీల్ సాబ్’’ డబ్బింగ్ పూర్తి!!

దాదాపు మూడేళ్ల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మూవీ ‘‘వకీల్ సాబ్’’. ప్రెస్టెజీయస్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ మూవీని దిల్ రాజు-శిరీష్ నిర్మించగా శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేశారు.ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి. రీసెంట్ గా ఈ సినిమా డబ్బింగ్ మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ ఈ రోజు కంప్లీట్ చేశారు.దీంతో ఈ సినిమా డబ్బింగ్ మొత్తం పూర్తయింది. ఫైనల్ మిక్సింగ్ తదితర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న థియేట్రికల్ ట్రైలర్ ఈ నెల 29న రిలీజ్ కాబోతుంది.

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌ క‌ల్యాణ్ హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్‌, నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల ఇత‌ర తారాగ‌ణంగా న‌టిస్తున్నారు.
ఈ చిత్రానికి
సంగీతం: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌,
సినిమాటోగ్ర‌ఫీ: పి.ఎస్‌.వినోద్‌,
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: రాజీవ‌న్‌,
ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ పూడి,
డైలాగ్స్‌: తిరు,
యాక్ష‌న్ ర‌వివ‌ర్మ‌,
వి.ఎఫ్‌.ఎక్స్‌: యుగంధ‌ర్‌,
కో ప్రొడ్యూస‌ర్‌: హ‌ర్షిత్ రెడ్డి,
స‌మ‌ర్ప‌ణ‌: బోనీ క‌పూర్‌,
నిర్మాత‌లు: దిల్‌రాజు, శిరీష్ ,
మాటలు-మార్పులు-ద‌ర్శ‌క‌త్వం: శ్రీరామ్ వేణు.