
దసరా, దేవర వంటి భారీ చిత్రాలలో నటించిన మలయాళ నటుడు షైన్ టాన్ చాకో పై నార్కోటిక్ పోలీసులు రైడ్ చేయడం జరిగింది. నటుడు షైన్ టాన్ చాకో కోచిలో హోటల్ లో డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు సమాచారం అందిన నార్కోటిక్ పోలీసులు తనపై రైడ్కు వెళ్ళగా అది గమనించిన టామ్ చాకో కొద్దిసేపటి ముందే మూడో అంతస్తులు తను ఉంటున్న రూమ్ నుండి 2వ అంతస్తు కిటికీలోకి దూకి ఆ తర్వాత మెట్ల ద్వారా పారిపోయారు అని సమాచారం. దానికి ముందు సూత్రవాక్యం అనే సినిమా షూటింగ్ సమయంలో షైన్ టాన్ చాకో డ్రగ్స్ తీసుకుని తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని నటి విన్సీ సోని అలోషియస్ ఆరోపించారు. దీనిపై కేరళ ఫిలిమ్ చాంబర్ తో పాటు అమ్మ అసోసియేషన్కు కూడా ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.