మూవీ మొఘల్ డాక్టర్ డి. రామానాయుడు గారి 86వ జయంతి వేడుకలు

నేస్తం ఫౌండేషన్, తెలుగు సినిమా వేదిక, కూనిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూవీ మొఘల్ డాక్టర్ డి. రామానాయుడు గారి 86వ జయంతి కార్యక్రమాలు తెలుగు నిర్మాతల మండలి హాలులో 06-06-2022 వ తేదీ ఘనంగా జరిగాయి.. కార్యక్రమంలో రామానాయుడు గారి బ్యానర్ లో దర్శకులుగా పనిచేసిన బోయిన సుబ్బారావు, వై.నాగేశ్వర రావు, కె.సదాశివ రావు, జయంత్ సి పరాన్జీ, కాశీ విశ్వనాథ్, ముప్పలనేని శివ,చంద్ర మహేష్, వి.యన్.ఆదిత్య, పి.సునీల్ కుమార్ రెడ్డి గార్లకు మరియు రామానాయుడి గారి పేరు మీద మూవీ మొఘల్ అనే పుస్తకాన్ని రచించిన సీనియర్ జర్నలిస్ట్ యు.వినాయక రావు గారికి డాక్టర్ రామానాయుడు స్మారక పురస్కారం అందజేశారు.. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తమ్మారెడ్డి భరద్వాజ,వి.విజయేంద్ర ప్రసాద్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు కొల్లి రామకృష్ణ, కార్యదర్శి కె.యల్. దామోదర ప్రసాద్, నిర్మాతల మండలి కార్యదర్శి టి.ప్రసన్న కుమార్, ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి ఖాజా సూర్యనారాయణ, నిర్మాతలు ఏ. గురురాజ్, పి. సత్యా రెడ్డి, వి.వి.ఋషిక గారు పాల్గొని రామానాయుడు గారికి నివాళులు అర్పించి , ఆయన గొప్పతనాన్ని కొనియాడారు..
ఈ కార్యక్రమంను జె.వి.మోహన్ గౌడ్, పి.విజయ వర్మ, కూనిరెడ్డి శ్రీనివాస్, బాబ్జీ నిర్వహించారు..