బాబోయ్.. కాజల్ డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?

ఇటీవల పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్ తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తుంది. హనీమూన్ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులను పంచుకుంటూ ఉంది. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఎరువు రంగు సెమీ షీర్ డ్రెస్‌లో బీచ్‌లో తన భర్తతో కలిసి దిగిన ఫొటోలను కాజల్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

ఈ డ్రెస్ చూడటానికి చాలా అందంగా ఉండటంతో దీని ధర గురించి సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతోంది. ఈ డ్రెస్ విలువ రూ.13 వేలు అని తెలుస్తోంది. ఈ డ్రెస్ ర్యాట్ అండ్ బోవా బ్రాండ్‌కి చెందినది. ఎరుపురంగు డ్రెస్‌తో మ్యాచ్ అయ్యేలా ఎరుపు ఇయర్ రింగ్స్‌తో ఈ ఫొటోలో కాజల్ కనిపించింది. ఆ ఫొటోలకు అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

ఇటీవల మాల్దీవుల్లో అండర్ వాటర్‌లో ఒక హోటల్‌లో భర్తతో కలిసి కాజల్ దిగిన ఫొటోలు ఎంత ట్రెండ్ అయ్యాయో మనకు తెలిసిందే. అక్టోబర్ 30న ముంబైలోని ఒక ప్రైవేట్ హోటల్‌లో బంధువులు, సన్నిహితల సమక్షంలో గౌతమ్ కిచ్లును కాజల్ పెళ్లి చేసుకుంది. అతడు, కాజల్ ఎప్పటినుంచో మిత్రులు.