‘దొరసాని’’ లో నిజాయితీ ఆకట్టుకుంటుంది- ట్రైలర్ లాంచ్ లో సుకుమార్

ఆనంద్ దేవరకొండ, శివాత్మక లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్ టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాలు సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ ‘దొరసాని’.. జులై 12న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ చేతుల మీదగా జరిగింది. కె.వి.ఆర్. మహేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ మూవీని మధురా శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్సణలో రిలీజ్ అవుతున్న దొరసాని ప్రేక్షకుల్లో, పరిశ్రమలో ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ 2 మిలియన్ వ్యూస్ ని దాటింది. రిలీజ్ చేసిన ‘నింగిలోన పాలపుంత, కళ్ళల్లో కలవరమై’ పాటలకు మంచి స్పందన లభించింది. నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తిచేసుకొని, గ్రాండ్ గా రిలీజ్ కి సిద్దం అవుతన్న ‘దొరసాని’ ట్రైలర్ లాంచ్ లో ముఖ్య అతిథులు, చిత్ర బృందం మాట్లాడుతూ:

నిర్మాత మధురశ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ :

‘ఈ సినిమా కథ ఎంత నిజాయితీగా చెప్పాడో, అంతే నిజాయితీగా దర్శకుడు మహేంద్ర
సినిమా చేసాడు. కథ విన్నప్పడు కలిగిన ఫీల్ ని తెరమీదకు వందశాతం తెచ్చాడు.
ఒక ఎడిటర్ నవీన్ నూలి తప్ప దాదాపుగా అందరూ కొత్త వాళ్ళతోనే ఈ సినిమా ని
నిర్మించాము. దొరసాని పై అన్ని వైపులా ఒక పాజిటల్ బజ్ క్రియేట్ అవుతుంది.
ఈ ట్రైలర్ ని సుకుమార్ గారి తో లాంచ్ చేయించాలని అనుకున్నాను. ఆయన రావడం
చాలా సంతోషంగా ఉంది.ఆనంద్,శివాత్మిక లిద్దరూ చాలా బాగా చేశారు.శివాత్మిక
మేకోవర్ విషయంలో జీవితగారు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.’ అన్నారు.

దర్శకుడు కె.వి.ఆర్ మహేంద్ర మాట్లాడుతూ:

‘సుకుమార్ గారితో స్టేజ్ మీద ఉన్నందుకు ధైర్యంగా ఉంది. బెరుకుగా ఉంది. ఈ
సినిమా కథను రాసుకున్నప్పుడు ఎలా ఉన్నానో. అంతే నిజాయితీ గా సినిమా
చేసేందుకు నాకు నిర్మాత మధురాశ్రీధర్ రెడ్డిగారు అండగా నిలబడ్డారు. ఈ
సినిమా లో ఏ ఎమోషన్ ఫేక్ గా అనిపించదు. ఇందులో ఒక వాస్తవికత ఉంది,
స్వచ్ఛత ఉంది. ఎనభై దశకాల్లో నడిచే ప్రేమ కథ ఇది. ఆ సామిజిక
పరిస్థితుల్లో దొరసాని తో ప్రేమలో పడితే ఆ ప్రేమ కథ ఎలాంటి ప్రయాణం
చేసింది అనేది గొప్పగా తీయడానికి ప్రయత్నించాను. నేను ఎంతగా ఈ కథను
ప్రేమించానో సినిమా యూనిట్ అంతా అంతే ప్రేమించారు. ఆనంద్ దేవరకొ్ండ,
శివాత్మిక ఈ పాత్రలకోసమే ఉన్నారా అనేంతగా ఈ పాత్రలకు ప్రాణం పోసారు.’
అన్నారు.

ముఖ్య అతిథి దొరస్వామిరాజు మాట్లాడుతూ :

‘ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఇద్దరు కొత్త వాళ్ళు చేసారా అనిపించడం లేదు.
జీవితగారి లెగసీ ని శివాత్మిక తప్పకుండా ముందుకు తీసుకెళ్తుంది. సామాజిక
పరిస్థితులకు అద్దం పట్టే ఇలాంటి కథలు తప్పకుండా ఆలోచనలో మార్పును
తెస్తాయి. టీం అందరికీ నా అభినందనలు . ’ అన్నారు.

శివాత్మిక రాజశేఖర్ మాట్లాడుతూ:

‘సుకుమార్ గారి సినిమాలకు నేను పెద్ద అభిమానిని. నేను నటించిన మొదటి
చిత్రం ట్రైలర్ ఆయన చేతుల మీదుగా రిలీజ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది.
దొరసాని పాత్రకు నన్ను అనుకున్నందుకు దర్శకుడు మహేంద్ర గారికి, నిర్మాత
మధురా శ్రీధర్ గారిని కృతజ్ఞతలు. మా ఇంట్లో అంతా సినిమా వాతావరణమే
ఉంటుంది. నా కుటుంబం నాకు ఒక పెద్ద ఫ్యామిలీని ఇచ్చింది అని ఈసినిమా
చేస్తున్నప్పుడు తెలిసింది. ఈ సినిమా నాకు డ్రీమ్ రోల్ ని ఇచ్చింది.
అన్నారు.’ అన్నారు.

ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ:

‘ఇది నాకు స్పెషల్ డే, దొరసాని నాకు స్పెషల్ ఫిల్మ్, నేను యుస్ లో జాబ్
చేసే వాడిని ఒక రోజు పెళ్ళి చూపులు ట్రైలర్ లాంచ్ కోసం ఆఫీస్ కి
వెళ్ళకుండా రూమ్ లో కూర్చొన్నాను. ఆ ట్రైలర్ లాంచ్ లో విజయ్ మాట్లాడేది
చూసి ఆనందంతో కన్నీళ్ళు వచ్చాయి. అన్నయ్యను సపోర్ట్ చేసిన ఆ మూడు
బ్యానర్స్ సురేష్ ప్రొడక్షన్స్, మధుర ఎంటర్ టైన్మెంట్స్, బిగ్ బెన్
ఇప్పుడు నన్ను సపోర్ట్ చేస్తున్నాయి. ఇదంతా ప్లాన్ చేస్తే అవదు..ఇదంతా
అవడానికి దర్శకుడు మహేంద్ర కారణం. అతను కథలు చెప్పడంలో జీనియస్. సినిమా
చూసినప్పుడు ప్రేక్షకులు ఇదే ఫీల్ అవుతారు. నేను, శివాత్మిక రాజు,
దొరసాని పాత్రలతో మీ ముందుకు వస్తున్నాం. మీరు మెచ్చుకుంటారనే నమ్మకం
ఉంది’ అన్నారు.

జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ:

‘శివాత్మిక, ఆనంద్ దేరకొండలకు ప్రేక్షకుల ఆశిస్సులు కావాలి. ఈ కథ చాలా మంచి ప్రేమకథ . ఇందులో ఎమోషన్స్ తప్పకుండా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి.’ అన్నారు.

దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ:

‘నిషీధి అనే షార్ట్ ఫిల్మ్ చేసి శ్యాబెనగల్ నుండి ప్రశంసలు పొందిన దర్శకుడు కె.వి.ఆర్. మహేంద్ర. దర్శకుడిగా అతని అభిరుచేంటో ట్రైలర్ చెబుతుంది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయి. ఇప్పుడు తెలుగు సినిమా తీరు మారింది. నిజాయితీ నిండిన కథలే ప్రేక్షకులు మనసు గెలుచుకుంటున్నాయి. కొత్త దర్శకులు చాలా మంచి సినిమాలతో వస్తున్నారు. దొరసాని లో పాటలు రోజూ వింటున్నాను. ‘ నింగిలోన పాలపుంత నవ్వులొంపెనే ’ పాట నన్ను హాంట్ చేస్తుంది. గోరెటి వెంకన్న సాహిత్యానికి నేను పెద్ద అభిమానిని. ఇలాంటి స్వచ్ఛమైన కథలను అందిస్తున్న మధుర శ్రీధర్ రెడ్డి గారికి నా అభినందనలు. సినిమా రచన వేరు, దర్శకత్వం వేరు. ఈ రెండు ఒకరే చేయడం తో ఎక్కువ సినిమాలు చేయలేకపోతున్నాము. దొరసాని లో అంతా నిజాయితీనే కనిపిస్తుంది. ఇలాంటి కాన్సెప్ట్ లకు వెన్నుదన్నుగా నిలుస్తున్న వెంకటసిద్దా రెడ్డి కి అభినందనలు. శివాత్మక పరెఫెక్ట్ తెలంగాణ అమ్మాయిలా
కనపడుతుంది. చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఆమె స్ర్కీన్ ప్రజెన్స్ బాగుంది. విజయ దేవరకొండ లో కనిపించిన నిజాయితీనే వాళ్ల తమ్ముడు ఆనంద్ దేవరకొండ మాటల్లో కూడా కనిపించింది. సినిమా పెద్ద విజయం సాధించాలని కొరుకుంటున్నాను. ’ అన్నారు.

ఆనంద్ దేవరకొండ, శివాత్మిక హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతోన్న ఈచిత్రంలో కన్నడ కిశోర్, వినయ్ వర్మ, ‘ఫిదా’ శరణ్య ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

సురేష్ బాబు సమర్పణలో వస్తోన్న ఈ చిత్రానికి

సినిమాటోగ్రఫీ : సన్నీ కూరపాటి

ఎడిటర్ : నవీన్ నూలి

సంగీతం : ప్రశాంత్ ఆర్.విహారి

ఆర్ట్ డైరెక్టర్ : జెకె మూర్తి

పి.ఆర్.వో : జి.ఎస్.కె మీడియా

కో ప్రొడ్యూసర్ : ధీరజ్ మొగిలినేని

నిర్మాతలు : మధుర శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని

రచన, దర్శకత్వం : కె.వి.ఆర్. మహేంద్ర