‘హిట్ 3’ చిత్రంలో ఇతడిని గుర్తుపట్టారా?

నటుడిగా చైతూ జొన్నలగడ్డకు ఉన్న క్రేజ్, వస్తున్న ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. బబుల్‌గమ్ చిత్రంలో యాదగిరి పాత్రలో చైతూ జొన్నలగడ్డకి మంచి ప్రశంసలు దక్కాయి. నటుడిగా తనకంటూ ఓ సపరేట్ కామెడీ టైమింగ్, ట్రాక్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు నాని ‘హిట్ 3’ చిత్రంలో ఎస్సై దివాకర్ పాత్రలో అందరినీ మెప్పించారు. అబ్ కీ బార్.. అర్జున్ సర్కార్ అనే డైలాగ్‌తో థియేటర్లను దద్దరిల్లేట్టు చేశాడు చైతూ జొన్నలగడ్డ. అలా బబుల్‌గమ్ చిత్రంలో కామెడీ పాత్రతో.. ఇప్పుడు హిట్ 3లో సీరియస్ పాత్రతోనూ మెప్పించారు.

నానితో చైతూ జొన్నలగడ్డకు వచ్చిన ప్రతీ సీన్ అదిరిపోయింది. థియేటర్లో దివాకర్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. నటుడిగా చైతూ జొన్నలగడ్డ మరోసారి ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేశాడు. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో చైతూ జొన్నలగడ్డ ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. ఈటీవీ విన్‌లో ఒక ప్రాజెక్ట్, ఓ హిందీ సినిమా, మరో రెండు క్రేజీ, భారీ చిత్రాల్లోనూ ఆయన నటిస్తున్నారు.