విజయ్ సేతుపతి ‘మహారాజ’ నిజాం డిస్ట్రిబ్యూషన్ ఎవరో తెలుసా?

విజయ్ సేతుపతి లీడ్ రోల్ లో నటిస్తున్న మహారాజ సినిమా ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ సీజేస్తుంది. విడుదల అవుతున్న ఒకొక్క పోస్టర్ లో విజయ్ సేతుపతి రిస్టిక్ గా కనిపిస్తున్నారు. నిథిలం స్వామినాథన్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాను సుధ సుందరం & జగదీష్ పళనిసామి కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా విజయ్ సేతుపతి 50వ సినిమా కావడం విశేషం. ఈ సినిమా ఈ నెల 14న విడుదలకు సిద్ధంగా ఉండగా నిజాం అంతటా మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. ఈ సినిమాలో అభిరామి, అనురాగ్ కశ్యప్, భారతీరాజా, మంట మోహన్దాస్, దివ్య భారతి, మునీశ్కాంత్ తదితరులు ముఖ్య పాత్రలలో నటించనున్నారు. అజనీష్ లోకనాథ్ సంగీతాన్ని అందించగా దినేష్, బురుషోత్తమం డిఓపి గా పనిచేసారు.