పవన్ కళ్యాణ్ సినిమాలో నటించిన ఆ యాంకర్ ఎవరో తెలుసా?

తెలుగు యాంకర్ అనసూయ టీవీ షోల ద్వారా అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి. అంతేకాకుండా అటు యాంకర్ గాను ఇటు సినిమాలలో నటిగాను బిజీగా ఉన్నారు. తెలుగు సినిమాలలో అగ్ర హీరోలు సినిమాలు అయిన రంగస్థలం లో రామ్ చరణ్ తో కలిసి రంగమ్మ అత్తగా, అలాగే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తో కూడా ఆమె నటించారు.

ఇది ఇలా ఉండగా తన సోషల్ మీడియా ప్లాట్ఫారం అయిన ఇంస్టాగ్రామ్ ద్వారా తన అభిమానంతో ఇటీవలే ఆమె ముచ్చటించడం జరిగింది. ఆ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు అనసూయ. అయితే ఒక పవన్ కళ్యాణ్ అభిమాని తను పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఎప్పుడు నటించబోతున్నారు అని అడిగిన ప్రశ్నకు ఆమె అప్పటికే పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక పాత్రలో నటించినట్లు, ఆ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది అన్నట్లు ఆవిడ సమాధానం ఇచ్చారు.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ సినిమాలు ఇప్పటికే మూడు అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఓజి, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు పవన్ కళ్యాణ్ ఒప్పుకుని ఉండగా వీటిలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించి కేవలం గ్లింప్స్ కోసం మాత్రం మాత్రమే షూటింగ్ జరిగినట్లు తెలుస్తుంది. అనసూయ చెప్పిన మాటల ప్రకారం ఇప్పటికే తన షూటింగ్ పవన్ కళ్యాణ్ సినిమాలో పూర్తయిపోయింది. కాబట్టి ఆమె ఓజి లేదా హరిహర వీరమల్లు సినిమాలలో ఉండే అవకాశం ఉంది. అయితే ఈ రెండు సినిమాలలో ఆమె ఏ సినిమాలో నటించారు అనేది తెలియాలంటే ఆ రెండు సినిమాలు విడుదలకు వేచి చూడాల్సిందే. కాగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడంతో ప్రస్తుతం మూడు నెలల పాటు తాను ఎటువంటి సినిమా షూటింగ్ లు చేయబడటం లేదని ఓ పబ్లిక్ మీటింగ్లో తెలిపారు.