
రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు #SSMB29 సినిమా తీస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో లక్కీకి వెళ్లిన రాజమౌళి సుమారు అదే సమయంలో ఓ సింహాన్ని చూపిస్తూ మహేష్ బాబుని ట్యాగ్ చేసి తన సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ చేశారు. ఆ తర్వాత అదే సింహాన్ని బంధించినట్లు పాస్పోర్ట్ చూపిస్తూ మరో పోస్ట్ చేయడంతో ఆ పాస్పోర్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు అని నటించిన కామెంట్స్ వర్షం కురిపించారు. సాధారణంగా మహేష్ బాబు తన కుటుంబంతో సమయం గడిపేందుకు ఎక్కువగా విదేశాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే రాజమౌళి సినిమా ఒక్కసారి మొదలైతే సుమారు నాలుగు ఐదు సంవత్సరాలు పాటు జరుగుతుందని ఒక అంచనా ఇప్పటికీ చిత్ర పరిశ్రమలో ఉంది. ఎక్కువగా విదేశాలకు ట్రిప్స్ కు వెళ్లే మహేష్ బాబుకు ఇకపై ట్రిప్స్ వెళ్లడం కష్టమే అని రాజమౌళి పాస్పోర్ట్ పట్టుకున్న పోస్ట్ చూసి అనుకున్నారు అభిమానులు. అయితే ఇటీవల కాలంలో మహేష్ బాబు తన పాస్పోర్ట్ చూపిస్తూ తన కుటుంబంతో కలిసి విదేశాలకు టూర్ కి వెళ్ళిన వీడియో నెట్లో బాగా వైరల్ గా మారింది.
అయితే మహేష్ బాబు ఈసారి తన కుటుంబంతో కలిసి వెకేషన్కు ఎక్కడికి వెళ్లారు అనే ప్రశ్న బాగా విడిపిస్తుంది. ఇది ఇలా ఉండగా మహేష్ బాబు భార్య నమ్రత అలాగే ఆయన కుమార్తె సితార తమ సోషల్ మీడియా అకౌంట్స్ అయిన ఇంస్టాగ్రామ్ ద్వారా కొన్ని పోస్టులు చేయడం జరిగింది. వాటిలో మహేష్ బాబు భార్య నమ్రత రోమ్ అంటేనే అందమైనది అని చెప్పగా ప్రస్తుతం మహేష్ బాబు యూరోప్ లోని ఇటలీలో ఉన్నట్లు అర్థమవుతుంది. అయితే ఈ ట్రిప్పు ఎన్ని రోజులు ఉండిపోతుంది అనే ప్రశ్న అభిమానులకు మరింత ఉత్సాహపంతమైన ప్రశ్నగా మారింది. కానీ రాజమౌళి తర్వాత సినిమా షూటింగ్ షెడ్యూల్ ఏప్రిల్ 15 తర్వాత ఉంటుందని కొన్ని వర్గాలలో వినిపిస్తుండగా త్వరలోనే మహేష్ బాబు తిరిగి ఇండియాకు వస్తారని అర్థమవుతుంది.