అమల పాల్ కు కొడుకు – పేరు ఏంటో తెలుసా?

తెలుగు వారికి ఇద్దరమ్మాయిలతో, నాయక్ వంటి సినిమాలతో సుపరిచితురాలు అయిన అమల పాల్ గత ఏడాది పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. గత ఏడాది అక్టోబర్ 26న అమల పాల్ పుట్టినరోజున తన ప్రియుడు జగత్ దేశాయ్ తమ ప్రేమ విషయాన్నీ బయట పెట్టాడు. అది జరిగిన 10 రోజుల తరువాత నవంబర్ 6న వారి వివాహం జరిగింది.

కాగా జూన్ 8న ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ‘బేబీ కం డౌన్, కం డౌన్’ అనే పాడే పాత సమయం వచ్చేసింది అని ఆ పోస్టులో తెలిపారు. అయితే ఆ పోస్ట్ ద్వారా ఆమె గర్భవతి అని తెలిసింది. ఆ తరువాత జూన్ 11న ఆమె డెలివరీ అయింది. ఇటీవలే ఆమె “అబ్బాయి పుట్టాడు. మా చిన్నారి, మా మిరాకిల్… ‘ఇలయ్’ ను చుడండి. జూన్ 11న జన్మించాడు” అనిముఖం కనిపించకుండా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

https://www.instagram.com/reel/C8Ua6Y9ShLW/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==