‘గంగవ్వ’ వయసు ఎంతో తెలుసా..’నాగ్’ కూడా అవ్వా అనేస్తున్నాడు?

బిగ్ బాస్ షోలో ప్రస్తుతం కంటెస్టెంట్ గా ఉన్న గంగవ్వకు ఆడియెన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. మొదటివరమే ఆమెకు ఆడియెన్స్ నుంచి భారీ మద్దతు లభించిందని వచ్చిన ఓట్ల ద్వారా అర్ధమయ్యింది. దాదాపు నలభై శాతం ఓట్లు ఆమెకె వచ్చాయి. ఇక గంగవ్వకి సంబంధించిన అనేక రకాల వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇక నాగార్జున ఆమెను అవ్వ అనడంపై సోషల్ మీడియాలో అనేక రకాల మీమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే గంగవ్వ నాగార్జున కంటే ఒక ఏడాది మాత్రమే పెద్ద. నాగార్జున వయసు 61సంవత్సరాలు కాగా గంగవ్వ వయసు 62 ఏళ్ళు. ఒక ఏడాది పెద్ద అయినప్పటికీ నాగార్జున అవ్వ అని పిలవడం నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తోందని జోక్స్ చాలానే వస్తున్నాయి. ఇక బిగ్ బాస్ షోలో తొలివారం నామినేషన్స్ లో ఉన్నప్పటికీ కూడా గంగవ్వ మళ్ళీ ఆడియెన్స్ సపోర్ట్ తో సేఫ్ జోన్ లోకి వచ్చేసింది. తొలివారం సూర్య కిరణ్ ఎలిమినెట్ అవ్వగా సాయి కుమార్ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు.