‘క్రాక్’ తొలిరోజు కలెక్షన్లు ఏంతో తెలుసా?

మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ‘క్రాక్’ సినిమాకు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. జనవరి 9న మార్నింగ్ షో నుంచి ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. నిర్మాత ఠాగూర్ మధు ఆర్థిక లావాదేవీల వల్ల నైట్ షో నుంచి సినిమా మొదలైంది. దీంతో ఈ రోజు కలెక్షన్లు తగ్గిపోయాయి. కానీ సినిమాకు మంచి టాక్ రావడం, రివ్యూలు పాజిటివ్‌గా రావడంతో.. ఆదివారం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది.

KRACK FIRST DAY COLLECTIONS

శనివారం నైట్ షో, ఆదివారంతో కలిపి తెలుగు రాష్ట్రాల్లో రూ.10.50 కోట్ల గ్రాస్ వచ్చినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఒక తెలుగు రాష్ట్రాల్లో రూ.6 కోట్ల వరకు షేర్ రాబట్టినట్లు సమాచారం. శనివారం మొత్తం షోలు ఆడితే మరిన్ని కలెక్షన్లు రాబట్టేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. 50 శాతం ఆక్యూపెన్సీతో మాత్రమే థియేటర్లు నడుస్తున్న క్రమంలో క్రాక్‌కు ఇంత పెద్ద మొత్తంలో కలెక్షన్లు రావడం మంచి పరిణామమే అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.