సలార్’ అంటే ఏంటో తెలుసా?

కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేయనున్న సినిమాకు సలార్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన ప్రభాస్ ఫస్ట్ లుక్ డార్లింగ్ అభిమానులను అలరించింది. ఇందులో గన్ను పట్టుకుని మీసంతో డిఫరెంట్ లుక్‌లో ప్రభాస్ కనిపించింది. దీంతో ‘సలార్’ అంటే అర్ధం ఏంటని చాలామంది నెట్‌లో సెర్చ్ చేస్తున్నారు.

salaar

ఈ క్రమంలో సలార్ అంటే అర్థం ఏంటో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చెప్పేశాడు. సలార్ అంటే ఉర్ధూ భాష ప్రకారం సమర్థవంతమైన నాయకడు అని అర్థమని తెలిపాడు. రాజుకి కుడి భుజంగా ఉంటూ ప్రజల సంరక్షణ కోసం పాటుపడే వ్యక్తి అని చెప్పాడు. ఈ సినిమా ద్వారా ఓ వైలెంట్ పాత్రను ప్రేక్షకుల ముందుకు తీసుకోస్తున్నామని, కథకు అద్ధంపట్టేలా ఫస్ట్‌లుక్‌ను తీర్చిదిద్దామన్నాడు.

ప్రభాస్ లుక్ చూడగానే ఆయన ఆర్మీలో ఉండే వ్యక్తి అని అందరూ అనుకుంటారనే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను టైటిల్‌తో విడుదల చేశామని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చాడు. సలార్ టైటిల్‌కు చాలామంది ఎన్నో రకాల కొత్త అర్ధాలు చెబుతున్నారని, కానీ అది ఒక సామాన్యమైన పదం అని ప్రశాంత్ నీల్ చెప్పాడు. చాలామంది హీరోలు ఉండగా.. టాలీవుడ్‌కి చెందిన ప్రభాస్‌తోనే ఎందుకు సినిమా తీస్తున్నారని చాలామంది అడిగారని, కానీ తాను రాసుకున్న సలార్ కథకు ప్రభాస్ సరిగ్గా సరిపోతాడని తనకు అనిపించిందన్నాడు. అందుకే ప్రభాస్‌తో ఈ సినిమా చేస్తున్నానని, మిగతా విషయాలు సినిమా విడుదల అయ్యాక మాట్లాడుతానన్నాడు.