తెలుగు యాంకర్ల రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

హీరోయిన్స్ తర్వాత ఎక్కువ సంపాదించేది ఎవరంటే యాంకర్లు, నటీమణులు. హీరోయిన్ స్టార్‌డమ్, గత సినిమాల రిజల్ట్‌ని బట్టి వారికి కోట్లలో రెమ్యూనరేషన్ ఉంటుంది. వారి తర్వాత ఇక యాంకర్లు, నటీమణులు ఎక్కువ సంపాదిస్తూ ఉంటారు. ప్రస్తుతం తెలుగులో బాగా సంపాదిస్తున్న యాంకర్ల, నటీమణుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

TELUGU ANCHORS REMUNARATION

తెలుగు ఇండస్టీలో నెంబర్ వన్ యాంకర్ అనగానే మనందరికీ గుర్తొచ్చే పేరు సుమ. సినిమా ఆడియో ఫంక్షన్లకు యాంకరింగ్‌తో పాటు టీవీ ఛానెల్స్‌లలో వివిధ షోలు సుమ బాగా సంపాదిస్తోంది. ఒక్కో ఆడియో ఫంక్షన్‌కు రూ. 2 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు సుమ తీసుకుంటుంది. ఇక టీవీ షోలను హోస్ట్ చేసినందుకు కూడా పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ ఉంటుంది. ఇక జబర్దస్త్ యాంకర్ అనసూయ కూడా ఒక్కో ఈవెంట్‌కు రూ.2 లక్షల వరకు ఛార్జ్ చేస్తుంది. ఇక రష్మీ రూ.లక్షన్నరపైగా తీసుకుంటుంది. ఇక శ్రీముఖి రూ.లక్ష వరకు తీసుకుంటుండగా.. శ్యామల రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు తీసుకుంటుంది.