రవితేజ క్రాక్ సినిమాకు భారీ కలెక్షన్లు

రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కించిన క్రాక్ సినిమా భారీ కలెక్షన్లను సంపాదించుకుంటోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాను చూసేందుకు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులు పోటీ పడుతున్నారు. శనివారం రాత్రి షో నుంచి ఈ సినిమా ప్రారంభమవ్వగా.. ఆదివారం, సోమవారాల్లో భారీ కలెక్షన్లు వచ్చాయి.

RAVITEJA KRACK MOVIE COLLECTIONS

ఇప్పటివరకు రూ. 9 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొదటి రోజు నైట్ షో, ఆదివారం కలెక్షన్లు రూ.6 కోట్లకు పైగా ఉండగా.. సోమవారం మరో మూడు కోట్లు వచ్చాయి. రేపు, ఎల్లుండి మాస్టర్, రెడ్, అల్లుడు అదుర్స్ సినిమాలు రిలీజ్ అవుతుండటంతో.. కలెక్షన్లు కొంచెం తగ్గే అవకాశముంది. ఈ మూడు సినిమాలను తట్టుకుని రవితేజ క్రాక్ సినిమా ఎంతవరకు వసూళ్లను రాబడుతుందో వేచి చూడాలి. ఏది ఏమైనా 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే థియేటర్లు నడుస్తున్న క్రమంలో.. క్రాక్‌కు ఇంత పెద్ద మొత్తంలో కలెక్షన్లు రావడం మంచి పరిణామమే అని చెప్పాలి.